Mr Bachchan Business: రవితేజకు రికార్డు బిజినెస్.. ఏకంగా అన్ని కోట్లు.. హిట్ కావాలంటే ఎంత రావాలంటే!

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండానే వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తనదైన టాలెంట్లతో ప్రేక్షకులను ఫిదా చేసిన హీరో రవితేజ. మరీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌ను అలరించిన అతడు.. బీ, సీ సెంటర్లలో పాగా వేసేశాడు. దీంతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇలా ఇప్పుడు రవితేజ 'మిస్టర్ బచ్చన్' అనే సినిమాను చేశాడు. ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీ ఎన్నో అంచనాలతో రాబోతుంది. ఈ నేపథ్యంలో రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమా ఎంత బిజినెస్ చేసిందో తెలుసుకుందాం పదండి!

మిస్టర్ బచ్చన్‌ మారిన రవితేజ
టాలీవుడ్ స్టార్ రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమానే 'మిస్టర్ బచ్చన్'. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. అలాగే, జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలు చేశారు.

Ravi Teja Starrer Mr Bachchan Movie Worldwide Pre Release Business Details

అలాంటి స్టోరీ.. ఫుల్ యాక్షన్‌

రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' మూవీ ఫుల్ లెంగ్త్ కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్ అయిన హీరోకు ఓ విలన్‌పై దాడి చేయాల్సిందిగా ఆర్డర్ వస్తుంది. అప్పుడు హీరో అతడిని ఎలా ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. దీంతో దీనిపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.

రిలీజ్‌కు రెడీ.. సందడిగానే
మాస్ మహారాజా రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' మూవీని ఆగస్టు 15వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇక, ఎప్పటి నుంచో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ సందడి కనిపిస్తోంది. ఈ సినిమా కోసం థియేటర్లను ముస్తాబు చేస్తూ.. ఫ్లెక్సీలు రెడీ చేస్తూ ఫ్యాన్స్ తెగ రచ్చ చేస్తున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా హడావిడి ఉంటోంది.

Ravi Teja Starrer Mr Bachchan Movie Worldwide Pre Release Business Details

ఏపీ, తెలంగాణలో బిజినెస్

రవితేజ హీరోగా నటించిన 'మిస్టర్ బచ్చన్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ సినిమా నైజాంలో రూ. 11.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 11.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిసి దీనికి రూ. 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

వరల్డ్ వైడ్ బిజినెస్ ఇలా
'మిస్టర్ బచ్చన్' మూవీకి ఆరంభంలోనే మంచి హైప్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా హక్కులు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.00 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 31 కోట్లు వ్యాపారం జరిగింది. అంటే ఇది హిట్ అవ్వాలంటే మాత్రం రూ. 32 కోట్లు షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది.

Ravi Teja Starrer Mr Bachchan Movie Worldwide Pre Release Business Details

ఆ సినిమాల కంటే ఎక్కువ

రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 31 కోట్లు బిజినెస్ జరిగింది. తద్వారా అతడి కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్ చేసుకున్న చిత్రాల్లో ఇది 2వ స్థానానికి చేరుకుంది. దీనికంటే ముందు 'టైగర్ నాగేశ్వరరావు' రూ. 37.50 కోట్లు ఉంది. దీని తర్వాత 'ఖిలాడీ' రూ. 22.80 కోట్లు, 'రావణాసుర' రూ. 22.20 కోట్లతో టాప్ 4 స్థానాల్లో ఉన్నాయి.

More from Filmibeat

Read more about: mr bachchan ravi teja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X