RAVANASURA 1st Week Collections: 23 కోట్ల టార్గెట్.. వారంలో ఘోరంగా.. అదే జరిగితే అన్ని కోట్ల నష్టం!

ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చినా.. కష్టపడేతత్వంతో సుదీర్ఘ పోరాటం తర్వాత టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయాడు మాస్ మహారాజా రవితేజ. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌కు మరింత దగ్గరై.. పక్కా కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇలా హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే రవితేజ గత వారమే 'రావణాసుర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మాత్రం ఆశించిన రీతిలో వసూళ్లు రావట్లేదు. ఈ నేపథ్యంలో రవితేజ సినిమా వారం రోజుల్లో ఎంత రాబట్టిందో చూడండి!

రావణుడిగా రవితేజ ఎంటర్:మాస్ మహారాజా రవితేజ - సుధీర్ వర్మ కాంబోలో వచ్చిన మూవీనే 'రావణాసుర'. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. దీనికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం ఇచ్చారు. ఇందులో అను ఇమాన్యూయేల్, మీనాక్షి చౌదరి, ఫరియా అబ్ధాల్లా, దక్ష, పూజితలు కీలక పాత్రల్లో నటించగా.. సుశాంత్ మంచి రోల్ చేశాడు.

Ravi Teja Starrer RAVANASURA Movie 1st Week Worldwide Box Office Collections

రావణాసుర బిజినెస్ డీటేల్స్:రవితేజకు వరుస హిట్లు రావడంతో 'రావణాసుర'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 10.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 2.20 కోట్లతో కలిపి రూ. 22.20 కోట్ల బిజినెస్ జరిగింది.

ఏడో రోజు ఎంత రాబట్టింది?:మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ రూపొందించిన 'రావణాసుర' చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దీనికి చాలా తక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏడో రోజు వసూళ్లు మరింతగా పడిపోయాయి. ఫలితంగా ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కేవలం రూ. 23 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.

Ravi Teja Starrer RAVANASURA Movie 1st Week Worldwide Box Office Collections

7 రోజుల్లో కలిపి ఎంతొచ్చింది?:'రావణాసుర'కు 7 రోజులకు కలిపి వసూళ్లు తక్కువగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 4.07 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.46 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.37 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 72 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 46 లక్షలు, గుంటూరులో రూ. 76 లక్షలు, కృష్ణాలో రూ. 55 లక్షలు, నెల్లూరులో రూ. 33 లక్షలతో కలిపి.. రూ. 9.72 కోట్లు షేర్, రూ. 16.45 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో రాబట్టని 'రావణాసుర' మూవీకి 7 రోజుల్లో రూ. 9.72 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 85 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.11 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే వారం రోజుల్లో ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 11.68 కోట్లు షేర్‌తో పాటు రూ. 21.15 కోట్లు గ్రాస్ వసూలైంది.

Ravi Teja Starrer RAVANASURA Movie 1st Week Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన 'రావణాసుర' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23.00 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి రూ. 11.68 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 11.32 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ను చేరుకుంటుంది.

అదే జరిగితే నష్టాలు తప్పవు:రవితేజ హీరోగా సుధీర్ వర్మ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'రావణాసుర'కు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఆశించిన రీతిలో కలెక్షన్లు దక్కడం లేదు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశగానే సాగుతోంది. ఇలా వారంలో ఈ చిత్రం చాలా తక్కువ వసూళ్లనే రాబట్టింది. ఇదే కంటిన్యూ అయితే రూ. 10 కోట్లకు పైగా నష్టాలు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X