RAVANASURA 5 Days Collections: రవితేజకు మరో షాక్.. 5వ రోజే ఇంత తక్కువగా.. అన్ని కోట్లు వస్తేనే హిట్
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరచుకుని.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ.. జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నాడు మాస్ మహారాజా రవితేజ. గత ఏడాది వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడిన అతడు.. 'ధమాకా', 'వాల్తేరు వీరయ్య' వంటి సక్సెస్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ ఉత్సాహంతోనే రవితేజ ఇప్పుడు 'రావణాసుర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మాత్రం ఆశించిన రీతిలో వసూళ్లు రావడం లేదు. ఈ నేపథ్యంలో రవితేజ నటించిన 'రావణాసుర' సినిమా 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!
రావణాసురుడిగా రవితేజ రాక:రవితేజ హీరోగా.. సుధీర్ వర్మ తెరకెక్కించిన మూవీనే 'రావణాసుర'. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. దీనికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం ఇచ్చారు. ఇందులో అను ఇమాన్యూయేల్, మీనాక్షి చౌదరి, ఫరియా అబ్ధాల్లా, దక్ష, పూజితలు కీలక పాత్రల్లో నటించగా.. సుశాంత్ ముఖ్యమైన రోల్ చేశాడు.

రావణాసుర ప్రీ బిజినెస్ డీటేల్స్:మాస్ మహారాజా రవితేజ మార్కెట్‌తో పాటు 'రావణాసుర'పై భారీ అంచనాలు ఏర్పడడంతో.. నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 10.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 2.20 కోట్లతో కలిపి రూ. 22.20 కోట్ల బిజినెస్ అయింది.
ఐదో రోజు ఎంత రాబట్టింది?:రవితేజ - సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన 'రావణాసుర' చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దీనికి చాలా తక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐదో రోజు వసూళ్లు మరింతగా పడిపోయాయి. ఫలితంగా ఈ సినిమాకు ఐదో రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కేవలం రూ. 36 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.

5 రోజుల్లో కలిపి ఎంతొచ్చింది?:'రావణాసుర'కు 5 రోజులకు కలిపి వసూళ్లు తక్కువగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 3.79 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.41 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.30 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 68 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 44 లక్షలు, గుంటూరులో రూ. 73 లక్షలు, కృష్ణాలో రూ. 52 లక్షలు, నెల్లూరులో రూ. 31 లక్షలతో కలిపి.. రూ. 9.18 కోట్లు షేర్, రూ. 15.45 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:రెండు రాష్ట్రాల్లో పెద్దగా రాణించని రవితేజ 'రావణాసుర' మూవీకి 5 రోజుల్లో రూ. 9.18 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.06 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఐదు రోజుల్లో ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 11.04 కోట్లు షేర్‌తో పాటు రూ. 19.95 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:మాస్ మహారాజా రవితేజ నటించిన 'రావణాసుర' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23.00 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 11.04 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 11.96 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.
మరీ ఇంత తక్కువ వసూళ్లు:రవితేజ హీరోగా సుధీర్ వర్మ రూపొందించిన 'రావణాసుర' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఆశించిన రీతిలో కలెక్షన్లు దక్కడం లేదు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్ రన్‌తోనే నడుస్తోంది. హిట్ అవ్వాలంటే మాత్రం ఇంకా దాదాపు రూ. 12 కోట్లకు పైగానే వసూలు చేయాలి. అయితే, ఇదే రన్ కంటిన్యూ అయితే టార్గెట్ చేరడం కష్టమే అని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











