Tiger Nageswara Rao Collections: 10వ రోజు సండే లక్.. ఏకంగా అన్ని కోట్లు.. రావాల్సింది ఎంతో తెలిస్తే!

గతంలో కంటే ఇప్పుడు టాలీవుడ్ హీరోల రేంజ్ భారీ స్థాయిలో పెరుగుతోంది. మన వాళ్లలో చాలా మంది పాన్ ఇండియా మార్కెట్‌పై ఫోకస్ చేస్తున్నారు. అందులో మాస్ మహారాజా రవితేజ ఒకడు. సినిమా సినిమాకూ తన స్థాయిని పెంచుకుంటోన్న అతడు.. ఇటీవలే 'టైగర్ నాగేశ్వరరావు' అనే బహు భాషా చిత్రంతో వచ్చాడు.

దీనికి మంచి టాక్‌తో పాటు డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి. అయితే, రెండో వారంలో డౌన్ అవుతోన్న ఈ చిత్రం సండే పుంజుకుంది. ఈ నేపథ్యంలో రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ 10 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై మీరే చూడండి!

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 10 Days Worldwide Collections

టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ: టాలీవుడ్ స్టార్ రవితేజ నటించిన యాక్షన్ మూవీనే 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ తెరకెక్కించిన ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం ఇచ్చాడు.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 10 Days Worldwide Collections

రవితేజ మూవీ బిజినెస్ ఇలా: మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి నైజాంలో రూ. 8.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 17 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 3.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 37.50 కోట్లు బిజినెస్ అయింది.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 10 Days Worldwide Collections

10వ రోజు తెలుగులో వసూళ్లు: 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి 10వ రోజు ఆంధ్రా, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 37 లక్షలు, సీడెడ్‌లో రూ. 22 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 18 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో రూ. 1.05 కోట్లు షేర్, రూ. 1.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

10 రోజులకూ కలిపి ఎంతంటే: 10 రోజుల్లో 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ తెలుగు రాష్ట్రాల్లో తక్కువే రాణించింది. దీంతో నైజాంలో రూ. 7.25 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.74 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.42 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.45 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 95 లక్షలు, గుంటూరులో రూ. 1.94 కోట్లు, కృష్ణాలో రూ. 1.25 కోట్లు, నెల్లూరులో రూ. 79 లక్షలతో రూ. 19.79 కోట్లు షేర్, రూ. 34.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 10 Days Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఏపీ, తెలంగాణలో 10 రోజుల్లో రూ. 19.79 కోట్లు రాబట్టిన రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ డీసెంట్‌గా రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.88 కోట్లు కలెక్ట్ చేసింది. వీటితో కలిపితే 10 రోజుల్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 23.72 కోట్లు షేర్‌, రూ. 44.00 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 10 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 38.50 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 23.72 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 14.78 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 10 Days Worldwide Collections

అసలైన పరీక్ష.. నష్టాలతోనే: స్టువర్టుపురం దొంగ జీవిత కథతో రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి ఆరంభం నుంచి డీసెంట్ వసూళ్లే వస్తున్నాయి. అయితే, రెండో వారంలో మాత్రం ఈ చిత్రం డౌన్ అవుతూ వీకెండ్‌లో బాగానే రాణించింది. కానీ, ఈ సినిమాకు 11వ రోజు నుంచి అసలైన పరీక్ష మొదలు కాబోతుంది. మొత్తంగా ఈ పరిస్థితిని బట్టి ఇది నష్టాలతోనే రన్ ముగించే ఛాన్స్ కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X