Tiger Nageswara Rao Collections: 11వ రోజు ఢమాల్.. రవితేజకు బిగ్ షాక్.. అన్ని కోట్ల నష్టాలు తప్పవా?

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చినా.. తనదైన సినిమాలతో ప్రత్యేకమైన ముద్రను వేసుకుంటూ స్టార్ హీరోగా హవాను చూపిస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. పక్కా కమర్షియల్ చిత్రాలతో పాటు అప్పుడప్పుడూ ప్రయోగాలు చేస్తోన్న అతడు.. ఇటీవలే 'టైగర్ నాగేశ్వరరావు' అనే పాన్ ఇండియా మూవీతో వచ్చాడు.

దీనికి మంచి టాక్‌తో పాటు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ, రెండో వారంలో మాత్రం డౌన్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ 11 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై మీరే చూడండి మరి!

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 11 Days Worldwide Collections

టైగర్ నాగేశ్వరరావు వచ్చాడు: మాస్ మహారాజా రవితేజ నటించిన క్రేజీ సినిమానే 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ తెరకెక్కించిన ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం ఇచ్చాడు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 11 Days Worldwide Collections

రవితేజ మూవీ బిజినెస్ ఇలా: రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి నైజాంలో రూ. 8.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 17 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 3.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 37.50 కోట్లు బిజినెస్ చేసుకుంది.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 11 Days Worldwide Collections

11వ రోజు తెలుగులో వసూళ్లు: 11వ రోజు 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో రెస్పాన్స్ పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో రూ. 30 లక్షలు షేర్, రూ. 55 లక్షలు గ్రాస్ వచ్చింది.

11 రోజులకూ కలిపి ఎంతంటే: 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తక్కువే రాణించింది. దీంతో నైజాంలో రూ. 7.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.79 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.46 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.48 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 97 లక్షలు, గుంటూరులో రూ. 1.96 కోట్లు, కృష్ణాలో రూ. 1.27 కోట్లు, నెల్లూరులో రూ. 81 లక్షలతో రూ. 20.09 కోట్లు షేర్, రూ. 34.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఏపీ, తెలంగాణలో 11 రోజుల్లో రూ. 20.09 కోట్లు రాబట్టిన రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ డీసెంట్‌గా రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.08 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.90 కోట్లు కలెక్ట్ చేసింది. వీటితో కలిపితే 11 రోజుల్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.07 కోట్లు షేర్‌, రూ. 44.70 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 11 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 38.50 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లో దీనికి రూ. 24.07 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 14.43 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 11 Days Worldwide Collections

11వ రోజే ఢమాల్.. నష్టాలతో: మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి ఆరంభంలో మంచి టాక్ వచ్చింది. దీంతో మొదటి నుంచి డీసెంట్ వసూళ్లే వస్తున్నాయి. అయితే, రెండో వారంలో మాత్రం ఈ చిత్రం డౌన్ అవుతూ వస్తోంది. ముఖ్యంగా 11వ రోజు ఈ చిత్రం ఢమాల్ అయింది. ఇదే కంటిన్యూ అయితే.. రవితేజకు బిగ్ షాక్ తగలడంతో పాటు దీనికి భారీ నష్టాలు వచ్చే చాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X