Tiger Nageswara Rao Collections: 12వ రోజు బిగ్ షాక్.. రవితేజకు ఎదురుదెబ్బ.. అన్ని కోట్లు నష్టం ఖాయం!
స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చి.. ఎంతో మంది బ్యాగ్రౌండ్ లేని వాళ్లకు ఇన్సిప్రేషన్ అయిన హీరోనే మాస్ మహారాజా రవితేజ. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన అతడు.. చాలా హిట్లను ఖాతాలో వేసుకున్నాడు.
ఈ ఉత్సాహంతోనే ఇటీవలే 'టైగర్ నాగేశ్వరరావు' అనే మరో ఎక్స్‌పిరిమెంటల్ మూవీతో వచ్చాడు. దీనికి మంచి టాక్‌తో పాటు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ, రెండో వారంలో మాత్రం పడిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ 12 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై మీరే లుక్కేయండి మరి!

టైగర్ నాగేశ్వరరావు ఎంటర్: టాలీవుడ్ స్టార్ రవితేజ నటించిన పాన్ ఇండియా మూవీనే 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ తెరకెక్కించిన ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం ఇచ్చాడు.

రవితేజ మూవీ బిజినెస్ ఇలా: రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి నైజాంలో రూ. 8.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 17 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 3.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 37.50 కోట్లు బిజినెస్‌తో గ్రాండ్‌గా విడుదలైంది.

12వ రోజు తెలుగులో వసూళ్లు: 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి 12వ రోజు ఆంధ్రా, తెలంగాణలో రెస్పాన్స్ పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో రూ. 22 లక్షలు షేర్, రూ. 45 లక్షలు గ్రాస్ వచ్చింది.

12 రోజులకూ కలిపి ఎంతంటే: 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో తక్కువే రాణించింది. దీంతో నైజాంలో రూ. 7.44 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.83 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.49 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.50 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 98 లక్షలు, గుంటూరులో రూ. 1.97 కోట్లు, కృష్ణాలో రూ. 1.28 కోట్లు, నెల్లూరులో రూ. 82 లక్షలతో రూ. 20.31 కోట్లు షేర్, రూ. 35.00 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: 12 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 20.31 కోట్లు రాబట్టిన రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ డీసెంట్‌గా రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.91 కోట్లు కలెక్ట్ చేసింది. వీటితో కలిపితే 12 రోజుల్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.32 కోట్లు షేర్, రూ. 45.25 కోట్లు గ్రాస్‌ను మాత్రమే వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: క్రేజీ యాక్షన్‌తో వచ్చిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 38.50 కోట్లుగా నమోదైంది. ఇక, 12 రోజుల్లో దీనికి రూ. 24.32 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 14.18 కోట్లు వెనకబడి ఉంది. ఇదే కొనసాగితే 10 కోట్లకు పైగా నష్టాలు వస్తాయి.


Click it and Unblock the Notifications











