Tiger Nageswara Rao Collections: టైగర్ ఖేల్ ఖతం.. 13వ రోజు మరీ ఇంత తక్కువగా.. రవితేజకు ఊహించని షాక్
తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన హీరోలు అందరూ పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే భారీ చిత్రాలను చేస్తున్నారు. అలా ఇటీవలే 'టైగర్ నాగేశ్వరరావు' అనే బహు భాషా చిత్రంతో వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ఈ చిత్రానికి అన్ని ప్రాంతాల్లోనూ మంచి టాకే వచ్చింది. కానీ, ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ మాత్రం ఆశించిన రీతిలో దక్కడం లేదు. ఫలితంగా ఈ చిత్రం వసూళ్లు రోజు రోజుకూ పడిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ 13 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై మీరే లుక్కేయండి!
టైగర్‌గా మారిన మాస్ హీరో:మాస్ మహారాజా రవితేజ నటించిన క్రేజీ మూవీనే 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ తెరకెక్కించిన ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు.

రవితేజ మూవీ బిజినెస్ ఇలా:రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి నైజాంలో రూ. 8.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 17 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 3.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 37.50 కోట్లు బిజినెస్ జరిగింది.
13వ రోజు తెలుగులో వసూళ్లు:13వ రోజు 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో రెస్పాన్స్ పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 5 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో రూ. 16 లక్షలు షేర్, రూ. 35 లక్షలు గ్రాస్ వచ్చింది.

13 రోజులకూ కలిపి ఎంతంటే:13 రోజుల్లో 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ తెలుగు రాష్ట్రాల్లో తక్కువే రాణించింది. దీంతో నైజాంలో రూ. 7.49 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.85 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.52 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.52 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 99 లక్షలు, గుంటూరులో రూ. 1.98 కోట్లు, కృష్ణాలో రూ. 1.29 కోట్లు, నెల్లూరులో రూ. 83 లక్షలతో రూ. 20.47 కోట్లు షేర్, రూ. 35.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఏపీ, తెలంగాణలో 13 రోజుల్లో రూ. 20.47 కోట్లు రాబట్టిన రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ డీసెంట్‌గా రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.11 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.93 కోట్లు కలెక్ట్ చేసింది. వీటితో కలిపితే 13 రోజుల్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.51 కోట్లు షేర్, రూ. 45.65 కోట్లు గ్రాస్‌ను మాత్రమే వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:బయోపిక్‌గా రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 38.50 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లో దీనికి రూ. 24.51 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 13.99 కోట్లు వెనకబడి ఉంది. ఇదే కొనసాగితే 10 కోట్లకు పైగా నష్టాలు రావొచ్చు.


Click it and Unblock the Notifications











