Tiger Nageswara Rao Collections: 2వ రోజు ఓ రేంజ్‌లో.. అప్పుడే అన్ని కోట్లు.. ఇది రవితేజ అరాచకం సామీ

టాలీవుడ్‌లో ప్రతి హీరో తన రేంజ్‌ను పెంచుకునే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. పెద్ద హీరోలు మాత్రం పాన్ ఇండియా స్థాయికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఇప్పుడు భారీ చిత్రంతో వచ్చిన హీరోనే మాస్ మహారాజా రవితేజ. ఈ స్టార్ హీరో నటించిన తాజా సినిమానే 'టైగర్ నాగేశ్వరరావు'. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి మంచి టాక్‌తో పాటు ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. ఆ తర్వాత రోజు కూడా ఇది బాగానే రాణించింది. ఈ నేపథ్యంలో 'టైగర్ నాగేశ్వరరావు' 2 రోజుల రిపోర్టును మీరే చూసేయండి మరి!

టైగర్ నాగేశ్వరరావు వచ్చాడు
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రమే 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ తీసిన ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 2 Days Worldwide Collections

రవితేజ మూవీ బిజినెస్ ఇలా
రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి నైజాంలో రూ. 8.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 17 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 3.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 37.50 కోట్లు బిజినెస్ జరుపుకుంది.

2వ రోజు తెలుగులో వసూళ్లు
'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2వ రోజూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 95 లక్షలు, సీడెడ్‌లో రూ. 45 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 26 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 20 లక్షలు, కృష్ణాలో రూ. 17 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలతో రూ. 2.45 కోట్లు షేర్, రూ. 4.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 2 Days Worldwide Collections

2 రోజులకూ కలిపి ఎంతంటే
'టైగర్ నాగేశ్వరరావు' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 2.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.10 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 74 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 60 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 37 లక్షలు, గుంటూరులో రూ. 80 లక్షలు, కృష్ణాలో రూ. 44 లక్షలు, నెల్లూరులో రూ. 28 లక్షలతో రూ. 6.78 కోట్లు షేర్, రూ. 11.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 6.78 కోట్లు రాబట్టిన రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 75 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 85 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపితే 2 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.38 కోట్లు షేర్‌, రూ. 15.10 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 2 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 38.50 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 8.38 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 30.12 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X