Tiger Nageswara Rao Collections: 38.50 కోట్లు రావాలి.. 2 వారాల్లో వచ్చింది ఇంతే.. అన్ని కోట్ల నష్టాలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకడు. రిజల్ట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా కమర్షియల్ సినిమాలతో వస్తున్న అతడు.. ఇటీవలే 'టైగర్ నాగేశ్వరరావు' అనే బయోపిక్ మూవీలో నటించాడు. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ వచ్చినా.. వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో లభించడం లేదు. ఫలితంగా ఇది నష్టాల దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ 14 రోజుల బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!
టైగర్‌గా వచ్చేసిన మాస్ హీరో:మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ మూవీనే 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ తెరకెక్కించిన ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు.

రవితేజ మూవీ బిజినెస్ ఇలా:స్టార్ హీరో రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి నైజాంలో రూ. 8.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 17 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 3.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 37.50 కోట్లు బిజినెస్ అయింది.
14వ రోజు తెలుగులో వసూళ్లు
'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి 14వ రోజు ఆంధ్రా, తెలంగాణలో రెస్పాన్స్ పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 5 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో రూ. 13 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్ వచ్చింది.

14 రోజులకూ కలిపి ఎంతంటే
14 రోజుల్లో 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ తెలుగు రాష్ట్రాల్లో మోస్తరుగా రాబట్టింది. దీంతో నైజాంలో రూ. 7.54 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.87 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.53 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.00 కోట్లు, గుంటూరులో రూ. 1.99 కోట్లు, కృష్ణాలో రూ. 1.30 కోట్లు, నెల్లూరులో రూ. 84 లక్షలతో రూ. 20.60 కోట్లు షేర్, రూ. 35.60 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
ఏపీ, తెలంగాణలో 14 రోజుల్లో రూ. 20.60 కోట్లు రాబట్టిన రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ డీసెంట్‌గా రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.14 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.95 కోట్లు కలెక్ట్ చేసింది. వీటితో కలిపితే 14 రోజుల్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.69 కోట్లు షేర్, రూ. 46.05 కోట్లు గ్రాస్‌ను మాత్రమే వసూలు చేసింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 38.50 కోట్లుగా నమోదైంది. ఇక, 14 రోజుల్లో దీనికి రూ. 24.69 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 13.81 కోట్లు వెనకబడి ఉంది. ఇదే కొనసాగితే 10 కోట్లకు పైగా నష్టాలు రావొచ్చు.


Click it and Unblock the Notifications











