Tiger Nageswara Rao Collections: 3వ రోజు భారీగా.. అన్ని కోట్లు దాటిన వసూళ్లు.. అదే అయితే హిట్ కష్టమే
చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి బడా హీరోగా ఎదిగి.. తనకంటూ ప్రత్యేకమైన శైలితో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ మధ్య కాలంలో హై రేంజ్ సినిమాలను చేస్తోన్న అతడు.. గత చిత్రంతో నిరాశనే ఎదుర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మాస్ హీరో 'టైగర్ నాగేశ్వరరావు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి డీసెంట్ రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా కలెక్షన్లు కూడా ఏవరేజ్‌గానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'టైగర్ నాగేశ్వరరావు' 3 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూసేయండి మరి!
స్టువర్టుపురం దొంగ వచ్చాడు:స్టువర్టుపురం దొంగ కథతో రవితేజ నటించిన చిత్రమే 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ తీసిన ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

రవితేజ మూవీ బిజినెస్ ఇలా:మాస్ హీరో రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి నైజాంలో రూ. 8.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 17 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 3.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 37.50 కోట్లు బిజినెస్ చేసుకుంది.
3వ రోజు తెలుగులో వసూళ్లు:'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 3వ రోజు రెస్పాన్స్ పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 95 లక్షలు, సీడెడ్‌లో రూ. 55 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 24 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 31 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో రూ. 2.73 కోట్లు షేర్, రూ. 4.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

3 రోజులకూ కలిపి ఎంతంటే:'టైగర్ నాగేశ్వరరావు' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 3.40 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.65 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 98 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 83 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 51 లక్షలు, గుంటూరులో రూ. 1.11 కోట్లు, కృష్ణాలో రూ. 63 లక్షలు, నెల్లూరులో రూ. 40 లక్షలతో రూ. 9.51 కోట్లు షేర్, రూ. 15.75 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 రోజుల్లో రూ. 9.51 కోట్లు రాబట్టిన రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.12 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.83 కోట్లు షేర్, రూ. 21.75 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 38.50 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 11.83 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 26.67 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

ఇంకా జోరు చూపించాలిగా:క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి డీసెంట్ వసూళ్లే వస్తున్నాయి. కానీ, ఈ చిత్రానికి టార్గెట్ ఎక్కువగా ఉన్న కారణంగా మరింత ఎక్కువ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. పండుగ సెలవులు అయిపోతే దీనికి అసలైన పరీక్ష మొదలు అవుతుంది. అప్పుడు జోరు చూపించకపోతే హిట్ స్టేటస్ చేరడం కష్టం అవుతుందని ట్రేడ్ వర్గాల టాక్.


Click it and Unblock the Notifications











