Tiger Nageswara Rao Collections: 4వ రోజే డౌన్.. వచ్చింది అన్ని కోట్లే.. రావాల్సింది ఎంతో తెలిస్తే!

ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చి.. ఎన్నో కష్టాలను అనుభవించిన తర్వాత స్టార్‌గా ఎదిగాడు టాలెంటెడ్ హీరో రవితేజ. ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌ను మెప్పించి మాస్ మహారాజా అనే ట్యాగ్‌ను కూడా తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి కమర్షియల్ చిత్రాలతో సత్తా చాటుతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీనికి డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా కలెక్షన్లు ఏవరేజ్‌గానే వస్తున్నాయి. మరి 'టైగర్ నాగేశ్వరరావు' 4 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూసేయండి!

బయోపిక్‌తో వచ్చిన రవితేజ:టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథతో రవితేజ నటించిన చిత్రమే 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ తీసిన ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 4 Days Worldwide Collections

రవితేజ మూవీ బిజినెస్ ఇలా:రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి నైజాంలో రూ. 8.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 17 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 3.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 37.50 కోట్లు బిజినెస్ జరుపుకుంది.

4వ రోజు తెలుగులో వసూళ్లు
'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 4వ రోజు రెస్పాన్స్ కాస్త తగ్గింది. ఫలితంగా నైజాంలో రూ. 85 లక్షలు, సీడెడ్‌లో రూ. 45 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 16 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, గుంటూరులో రూ. 27 లక్షలు, కృష్ణాలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో రూ. 2.27 కోట్లు షేర్, రూ. 4.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

4 రోజులకూ కలిపి ఎంతంటే
'టైగర్ నాగేశ్వరరావు' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 4.25 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.10 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.14 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 99 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 62 లక్షలు, గుంటూరులో రూ. 1.38 కోట్లు, కృష్ణాలో రూ. 81 లక్షలు, నెల్లూరులో రూ. 49 లక్షలతో రూ. 11.78 కోట్లు షేర్, రూ. 19.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 4 Days Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4 రోజుల్లో రూ. 11.78 కోట్లు రాబట్టిన రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.30 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.43 కోట్లు షేర్‌, రూ. 26.45 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 38.50 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి రూ. 14.43 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 24.07 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 4 Days Worldwide Collections

ఇలా అయితే కష్టమే గురూ
స్టువర్టుపురం దొంగ జీవిత కథతో వచ్చిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి డీసెంట్ వసూళ్లే వస్తున్నాయి. కానీ, ఈ చిత్రానికి టార్గెట్ ఎక్కువగా ఉన్న కారణంగా మరింత ఎక్కువ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. పండుగ సెలవులు అయిపోతే దీనికి అసలైన పరీక్ష మొదలు అవుతుంది. అప్పుడు కూడా ఇలాగే కొనసాగితే ఈ సినిమా హిట్ స్టేటస్ చేరడం కష్టంగా మారుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X