Tiger Nageswara Rao Collections: కుమ్మేసిన టైగర్.. 5 రోజుల్లో అన్ని కోట్లు.. రవితేజకు హిట్ రావాలంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అందులో మాస్ ట్యాగ్‌ను దక్కించుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ, దాన్నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. పక్కా కమర్షియల్ చిత్రాలతో సత్తా చాటుతోన్న అతడు.. ఇప్పుడు 'టైగర్ నాగేశ్వరరావు' అనే మూవీతో వచ్చాడు. దీనికి మంచి టాక్‌తో పాటు డీసెంట్ కలెక్షన్లు కూడా వస్తున్నాయి. హాలీడే కావడంతో ఐదో రోజు దీనికి రెస్పాన్స్ పెరిగింది. ఈ నేపథ్యంలో 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ 5 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!
దొంగగా వచ్చేసిన మాస్ హీరో:టైగర్ నాగేశ్వర్రావు అనే దొంగ కథతో రవితేజ నటించిన చిత్రమే 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ తీసిన ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు.

రవితేజ మూవీ బిజినెస్ ఇలా:మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి నైజాంలో రూ. 8.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 17 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 3.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 37.50 కోట్లు బిజినెస్ అయింది.
5వ రోజు తెలుగులో వసూళ్లు:'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 5వ రోజు రెస్పాన్స్ బాగా పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 1.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 62 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 34 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, గుంటూరులో రూ. 30 లక్షలు, కృష్ణాలో రూ. 20 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో రూ. 3.09 కోట్లు షేర్, రూ. 5.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

5 రోజులకూ కలిపి ఎంతంటే:'టైగర్ నాగేశ్వరరావు' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో ఇలా రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 5.40 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.70 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.50 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.20 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 77 లక్షలు, గుంటూరులో రూ. 1.68 కోట్లు, కృష్ణాలో రూ. 1.01 కోట్లు, నెల్లూరులో రూ. 61 లక్షలతో రూ. 14.87 కోట్లు షేర్, రూ. 25.45 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 5 రోజుల్లో రూ. 14.87 కోట్లు రాబట్టిన రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 5 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.02 కోట్లు షేర్, రూ. 33.00 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 38.50 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 18.02 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 20.48 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

పెరిగింది కానీ.. సరిపోదుగా:గడగడలాడించిన దొంగ జీవిత కథతో రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి డీసెంట్ వసూళ్లే వస్తున్నాయి. ఐదో రోజు ఇంకాస్త ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రానికి టార్గెట్ ఎక్కువగా ఉన్న కారణంగా మరింత ఎక్కువ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. సెలవులు పూర్తైన తర్వాత రెస్పాన్స్ తగ్గిపోతే మాత్రం బ్రేక్ ఈవెన్ చేయడం కష్టమే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











