Tiger Nageswara Rao Collections: 6వ రోజు అదుర్స్.. అన్ని కోట్లతో రవితేజ రికార్డు.. ఇంకెంత రావాలంటే!
ఏమాత్రం సినీ నేపథ్యం లేకుండానే వచ్చినా.. తనదైన టాలెంట్‌తో స్టార్ స్టేటస్‌ను అందుకున్న హీరో మాస్ మహారాజా రవితేజ. సినిమా సినిమాకూ తన రేంజ్‌ను పెంచుకుంటోన్న అతడు.. వరుసగా పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ స్టార్ హీరో 'టైగర్ నాగేశ్వరరావు' అనే మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. దీనికి మంచి టాక్‌తో పాటు డీసెంట్ కలెక్షన్లు కూడా వస్తున్నాయి. ఆరో రోజు కూడా హాలీడే కావడంతో ఇది బాగానే రాణించింది. ఈ నేపథ్యంలో 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ 6 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై లుక్కేయండి!
టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ:టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ నటించిన క్రేజీ సినిమానే 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ తీసిన ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు.

రవితేజ మూవీ బిజినెస్ ఇలా:స్టార్ హీరో రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి నైజాంలో రూ. 8.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 17 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 3.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 37.50 కోట్లు బిజినెస్ జరిగింది.
6వ రోజు భారీగా.. మొత్తంగా:వంశీ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాకు ఆరో రోజు కూడా మంచి స్పందన లభించింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 2 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.50 కోట్లు రాబట్టింది. ఇలా ఈ చిత్రం ఆరు రోజుల్లోనే రూ. 20 కోట్లు మార్కును చేరుకుని సత్తా చాటుకుంది.


Click it and Unblock the Notifications











