Tiger Nageswara Rao Collections: రూ. 38.50 కోట్ల సినిమా.. వారంలో వచ్చిందంతే… హిట్ కొట్టాలంటే?
టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. కొత్త దర్శకుడు వంశీ తీసిన ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో అభిషేక్ అగర్వాల్ నిర్మించాడు. ఇక ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అయి వారం రోజులు అయింది. ఇక వారం రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్ ఓసారి చూస్తే...
రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ విషయానికి వస్తే... మొదటి రోజు రూ. 4.33 కోట్లు, రెండో రోజు రూ.2.45 కోట్లు, 3వ రోజు రూ.2.73 కోట్లు, 4వ రోజు రూ.2.27 కోట్లు, 5వ రోజు రూ.3.23 కోట్లు, 6వ రోజు రూ.1.69 కోట్లు, 7వ రోజు రూ.74 లక్షలు రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 17.44 కోట్ల షేర్ (రూ.29.90 కోట్ల గ్రాస్) వసూలు చేసింది.

టైగర్ నాగేశ్వరరావు 7వ రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ గమనిస్తే... నైజాం రూ.28 లక్షలు, సీడెడ్ రూ.18 లక్షలు, ఉత్తర ఆంధ్ర రూ.12 లక్షలు, తూర్పు రూ.4 లక్షలు, పశ్చిమ రూ.3 లక్షలు, గుంటూరు రూ.4 లక్షలు, కృష్ణ రూ.3 లక్షలు, నెల్లూరు రూ.2 లక్షలు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజు మొత్తంగా రూ.74 లక్షల షేర్ (రూ.1.30 కోట్ల గ్రాస్) వసూళ్లు రాబట్టింది.
టైగర్ నాగేశ్వరరావు 7 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ గమనిస్తే... నైజాం రూ.6.43 కోట్లు, సీడెడ్ రూ.3.23 కోట్లు, ఉత్తర ఆంధ్ర రూ.2.04 కోట్లు, తూర్పు రూ.1.31 కోట్లు, పశ్చిమ రూ.84 లక్షలు, గుంటూరు రూ.1.79 కోట్లు, కృష్ణ రూ.1.11 కోట్లు, నెల్లూరు రూ.69 లక్షలు వసూలు రాబట్టింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.17.44 కోట్లు షేర్ (రూ.29.90 కోట్లు గ్రాస్) రాబట్టగా.. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.1.88 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 1.72 కోట్లు రాబట్టింది. మొత్తంగా వరల్డ్ వైడ్ కలెక్షన్లు చూసుకుంటే... రూ. 21.04 కోట్లు షేర్ (రూ.38.80 కోట్ల గ్రాస్) వసూలు చేసింది.
టైగర్ నాగేశ్వర రావు 1వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ. 5.20కోట్లు ( రూ.9.30కోట్లు గ్రాస్), 2వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.3.18కోట్లు (రూ.5.80కోట్లు గ్రాస్), 3వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.3.45కోట్లు (రూ.6.50కోట్లు గ్రాస్), 4వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.2.60కోట్లు (రూ.4.70కోట్లు గ్రాస్), 5వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.3.73కోట్లు (రూ.7.00కోట్లు గ్రాస్), 6వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.1.99కోట్లు (రూ.3.75 కోట్లు గ్రాస్), 7వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.89 లక్షలు( రూ.1.75 కోట్ల గ్రాస్) వసూలు చేసింది.

ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమాకు భారీగానే జరుపుకుంది. రిలీజ్ కు ముందు నుంచే హైప్ క్రియేట్ అవ్వడంతో రవితేజ కెరియర్ లో భారీ బిజినెస్ నమోదు చేసుకుంది. ఇక ఈ సినిమా మొత్తం బిజినెస్ రూ.37.50 కోట్లుగా నమోదు చేసుకుంది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 38.50 కోట్లతో బరిలోకి దిగింది. ఇక ఈ సినిమా హిట్ కావాలంటే... మరో రూ.17.46 కోట్లు రాబట్టాలి.


Click it and Unblock the Notifications











