Tiger Nageswara Rao Collections: 8వ రోజు బిగ్ షాక్.. అప్పుడే ఇంత తక్కువా? అన్ని కోట్లు వస్తేనే హిట్!

తెలుగు చిత్ర పరిశ్రమలోకి స్వయంకృషితోనే వచ్చి.. ఎన్నో కష్టాలను అనుభవించిన తర్వాత స్టార్‌గా మారిపోయాడు మాస్ మహారాజా రవితేజ. బడా హీరోనే అయినా ఏమాత్రం ల్యాగ్ చేయకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా ఇటీవలే ఈ మాస్ హీరో 'టైగర్ నాగేశ్వరరావు' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

దీనికి మంచి టాక్‌తో పాటు డీసెంట్ కలెక్షన్లు కూడా వస్తున్నాయి. అయితే, ఏడో రోజు నుంచే ఇది డౌన్ అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ 8 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై మీరే లుక్కేయండి!

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 8 Days Worldwide Collections

టైగర్ నాగేశ్వరరావు వచ్చాడు: మాస్ మహారాజా రవితేజ నటించిన క్రేజీ సినిమానే 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ తీసిన ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 8 Days Worldwide Collections

రవితేజ మూవీ బిజినెస్ ఇలా: రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి నైజాంలో రూ. 8.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 17 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 3.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 37.50 కోట్లు బిజినెస్ అయింది.

8వ రోజు తెలుగులో వసూళ్లు: 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 8వ రోజు రెస్పాన్స్ పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 21 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో రూ. 62 లక్షలు షేర్, రూ. 1.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

8 రోజులకూ కలిపి ఎంతంటే: 8 రోజుల్లో 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ తెలుగు రాష్ట్రాల్లో మోస్తరుగా రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 6.64 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.37 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.14 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.35 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 87 లక్షలు, గుంటూరులో రూ. 1.83 కోట్లు, కృష్ణాలో రూ. 1.15 కోట్లు, నెల్లూరులో రూ. 71 లక్షలతో రూ. 18.06 కోట్లు షేర్, రూ. 31 కోట్లు గ్రాస్ వచ్చింది.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 8 Days Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 8 రోజుల్లో రూ. 18.06 కోట్లు రాబట్టిన రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.92 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.75 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 8 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.73 కోట్లు షేర్‌, రూ. 40.10 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: మాస్ యాక్షన్‌తో వచ్చిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 38.50 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో దీనికి రూ. 21.73 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 16.77 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie 8 Days Worldwide Collections

రవితేజ మూవీకి బిగ్ షాక్: స్టువర్టుపురం దొంగ లైఫ్ స్టోరీతో రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి డీసెంట్ వసూళ్లే వస్తున్నాయి. అయితే, ఏడో రోజు నుంచి ఇది కోటి రూపాయల షేర్‌ను కూడా వసూలు చేయలేకపోతోంది. ఫలితంగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరకుండానే రన్‌ను ముగించే పరిస్థితికి వచ్చింది. అదే జరిగితే రవితేజ మూవీ నష్టాలను మూటగట్టుకునే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X