Tiger Nageswara Rao Collections: 9వ రోజు షాకింగ్ కలెక్షన్లు.. మొత్తం అన్ని కోట్లు.. రవితేజకు దెబ్బే!
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు.
ఈ ఏడాది పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ స్టార్ హీరో.. ఇటీవలే 'టైగర్ నాగేశ్వరరావు' అనే మూవీతో వచ్చాడు. దీనికి మంచి టాక్‌తో పాటు డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి. అయితే, రెండో వారంలో ఈ మూవీ డౌన్ అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ 9 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై మీరే లుక్కేయండి మరి!

టైగర్ నాగేశ్వరరావు ఎంటర్: మాస్ మహారాజా రవితేజ నటించిన బయోపిక్ మూవీనే 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ తెరకెక్కించిన ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు.

రవితేజ మూవీ బిజినెస్ ఇలా: మాస్ హీరో రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి నైజాంలో రూ. 8.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 17 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 3.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 37.50 కోట్లు బిజినెస్ జరిగింది.

9వ రోజు తెలుగులో వసూళ్లు: 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 9వ రోజు తక్కువే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 24 లక్షలు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో రూ. 67 లక్షలు షేర్, రూ. 1.20 కోట్లు గ్రాస్ వచ్చింది.
9 రోజులకూ కలిపి ఎంతంటే: 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తక్కువే రాణించింది. దీంతో నైజాంలో రూ. 6.88 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.52 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.24 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.39 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 90 లక్షలు, గుంటూరులో రూ. 1.87 కోట్లు, కృష్ణాలో రూ. 1.20 కోట్లు, నెల్లూరులో రూ. 74 లక్షలతో రూ. 18.74 కోట్లు షేర్, రూ. 32.20 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: 9 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 18.74 కోట్లు రాబట్టిన రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ డీసెంట్‌గా రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.98 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.82 కోట్లు కలెక్ట్ చేసింది. వీటితో కలిపితే 9 రోజుల్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.54 కోట్లు షేర్, రూ. 41.65 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: మాస్ యాక్షన్‌తో వచ్చిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 38.50 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి రూ. 22.54 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 15.96 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

వీకెండ్‌లో కూడా ఇలాగేనా?: ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్‌తో రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి ఆరంభం నుంచి డీసెంట్ వసూళ్లే వస్తున్నాయి. అయితే, రెండో వారంలో మాత్రం ఈ చిత్రం డౌన్ అవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వీకెండ్‌లో వసూళ్లు పెరుగుతాయని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా శనివారం కూడా ఈ చిత్రం చాలా తక్కువ కలెక్షన్లనే రాబట్టి నిరాశ పరిచింది.


Click it and Unblock the Notifications











