Tiger Nageswara Rao Collections: రవితేజ సంచలనం.. తొలి రోజే అన్ని కోట్లు.. రికార్డు బద్దలైందా అంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే మాస్ ఇమేజ్‌ను తెచ్చుకుని బీ, సీ సెంటర్లలో బీభత్సం సృష్టిస్తున్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు.
సినిమా సినిమాకూ తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తోన్న అతడు.. ఇప్పుడు 'టైగర్ నాగేశ్వరరావు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మంచి టాక్ రావడంతో తొలి రోజు రెస్పాన్స్ భారీగా వచ్చింది. ఫలితంగా ఇది అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. మరి 'టైగర్ నాగేశ్వరరావు' ఫస్ట్ డే రిపోర్టును మీరే చూసేయండి మరి!

టైగర్ నాగేశ్వర్రావుగా రవితేజ: స్టార్ హీరో రవితేజ - వంశీ కాంబినేషన్‌లో వచ్చిన మాస్ మూవీనే 'టైగర్ నాగేశ్వర్రావు'. ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

రవితేజ మూవీ బిజినెస్ ఇలా: రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి నైజాంలో రూ. 8.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 17 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 3.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 37.50 కోట్లు బిజినెస్ చేసుకుంది.
అలాంటి టాక్.. రెస్పాన్స్‌తో: మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ తెరకెక్కించిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ 1970 కాలంలో గజగజలాడించిన స్టువర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రేక్షకులు మంచి స్పందనను సైతం అందించారు.
తొలి రోజు తెలుగులో ఇలా: 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 65 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 48 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, గుంటూరులో రూ. 60 లక్షలు, కృష్ణాలో రూ. 27 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో రూ. 4.33 కోట్లు షేర్, రూ. 7.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలి రోజు రూ. 4.33 కోట్లు రాబట్టిన రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 45 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 42 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపితే తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.20 కోట్లు షేర్, రూ. 9.30 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: క్రేజీ కాంబోలో రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 38.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 5.20 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 33.30 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

ఆ రికార్డు బద్దలైందా అంటే: మాస్ మహారాజా రవితేజ - వంశీ కాంబినేషన్‌లో రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీకి మొదటి రోజు ఏపీ, తెలంగాణలో రూ. 4.33 కోట్లు షేర్ వసూలు అయింది. దీంతో ఇది ఈ స్టార్ హీరో కెరీర్‌లో మూడో అత్యధిక ఓపెనింగ్‌గా ఇది నిలిచింది. గతంలో 'క్రాక్' మూవీకి రూ. 6.25 కోట్లు షేర్ వసూలు అవగా.. 'ధమాకా'కు రూ. 4.66 కోట్లు వచ్చాయి.


Click it and Unblock the Notifications











