Tiger Nageswara Rao Business: రవితేజ మూవీకి రికార్డు బిజినెస్.. ఏకంగా అన్ని కోట్లతో సంచలనం

తెలుగు సినీ ఇండస్ట్రీలోని చాలా మంది హీరోలు ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాకు తమ స్థాయిని పెంచుకునే ప్రయత్నమే చేస్తున్నారు. అందులో మాస్ మహారాజా రవితేజ ఒకడు. గతంలో కంటే ఇప్పుడు మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తోన్న అతడు.. 'ధమాకా'తో వంద కోట్ల క్లబ్‌లో చేరాడు. అప్పటి నుంచి ఇంకాస్త వేగంగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'టైగర్ నాగేశ్వర్రావు' అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ వివరాలను మీరు కూడా చూసేయండి మరి!

టైగర్ నాగేశ్వర్రావుగా రవితేజ:మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ తెరకెక్కించిన మాస్ మూవీనే 'టైగర్ నాగేశ్వర్రావు'. ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Worldwide Pre Release Business

కమర్షియల్ బయోపిక్ స్టోరీనే:మాస్ ఎలిమెంట్లతో రూపొందిన 'టైగర్ నాగేశ్వర్రావు' మూవీ 1970 కాలంలో గజగజలాడించిన స్టువర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. పేరుకు బయోపిక్ మూవీనే అయినా ఇందులో ఎన్నో కమర్షియల్ హంగులు జోడించి తెరకెక్కించారు. దీంతో ఈ మూవీపై మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకుంటున్నారనే చెప్పాలి.

రిలీజ్‌కు రెడీ.. జోష్ తక్కువే:మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వర్రావు' మూవీని దసరా పండుగ కానుకగా అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఇక, ఎప్పటి నుంచో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఫీవర్ మొదలైంది. ఈ సినిమా కోసం థియేటర్లను ముస్తాబు చేస్తూ.. ఫ్లెక్సీలు రెడీ చేస్తూ ఫ్యాన్స్ తెగ రచ్చ చేస్తున్నారు. కానీ, బుకింగ్స్ విషయంలో మాత్రం ఈ మూవీ జోష్ అంతగా కనిపించట్లేదు.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Worldwide Pre Release Business

హక్కులు మాత్రం హట్ కేక్:ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'టైగర్ నాగేశ్వర్రావు' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఏపీ, తెలంగాణలో బిజినెస్:
రవితేజ హీరోగా నటించిన 'టైగర్ నాగేశ్వర్రావు' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ సినిమా నైజాంలో రూ. 8.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 17 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిసి దీనికి రూ. 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Worldwide Pre Release Business

వరల్డ్ వైడ్ బిజినెస్ ఇలా:'టైగర్ నాగేశ్వర్రావు' మూవీకి ఆరంభంలోనే దేశ వ్యాప్తంగా కూడా మంచి హైప్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా హక్కులు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 3.00 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.50 కోట్లు వ్యాపారం జరిగింది. అంటే ఇది హిట్ అవ్వాలంటే మాత్రం రూ. 38.50 కోట్లు రావాల్సిందే.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Worldwide Pre Release Business

రవితేజ కెరీర్‌లో టాప్ మూవీ:రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వర్రావు' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.50 కోట్లు బిజినెస్ జరిగింది. తద్వారా అతడి కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్ చేసుకున్న చిత్రంగా ఇది రికార్డును సాధించింది. గతంలో 'ఖిలాడి' మూవీ రూ. 22.80 కోట్లతో టాప్‌లో ఉండేది. దీని తర్వాత 'రావణాసుర'కు రూ. 22.20 కోట్లు, 'డిస్కో రాజా'కు రూ. 19.20 కోట్లు బిజినెస్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X