Don't Miss!
- News ఎన్నికల ప్రచారానికి నేటితో తెర: ఈ రాష్ట్రాల్లో ఎల్లుండి పోలింగ్
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
KRACK box office: 7 రోజుల కలెక్షన్స్.. ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే..?
మాస్ మహారాజా రవితేజ మొత్తానికి చాలా డేస్ తరువాత అసలైన బాక్సాఫీస్ హిట్ కొట్టేశాడు. రాజా ది గ్రేట్ సినిమా అనంతరం బ్యాక్ తో బ్యాక్ డిజాస్టర్స్ వల్ల సతమతమతమైన రవితేజకు క్రాక్ సినిమా ఒక్కసారిగా పవర్ఫుల్ బూస్ట్ ఇచ్చింది. ఇక సినిమా కలెక్షన్స్ స్టడీగానే ఉన్నాయి. మొదటి వారం కూడా ముగిసింది. ఇప్పటివరకు సినిమా పెట్టినపెట్టుబడిని వెనక్కి తెచ్చేసింది.
థియేటర్స్ లో మాస్టర్ హంగామా (ఫొటోలు)
డబ్బులు మొత్తం వెనక్కి వచ్చినట్లే..
బాక్సాఫీస్ వద్ద రవితేజకు హిట్టు పడి చాలా కాలమవుతోంది. ఇక క్రాక్ సినిమా కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను అందించింది. పాజిటివ్ టాక్ వచ్చినప్పటి నుంచి కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద స్పీడ్ మరింత పెంచింది. ఏరియాల వారిగా కలెక్షన్స్ చాలా స్టాండేర్డ్ గా ఉన్నాయి. ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి దాదాపు డబ్బులు వెనక్కి వెచ్చినట్లేనని తెలుస్తోంది.
మొదటిరోజు కలెక్షన్స్ ఎంతంటే..
మొదటిరోజు 6కోట్ల వరకు షేర్స్ అందించిన క్రాక్ రవితేజ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ ను అందించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. అసలే కరోనా కష్ట కాలంలో సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయి అని భయపడుతున్న తరుణంలో సినిమా రెండవ రోజు కూడా అదే తరహాలో ముందుకు సాగింది. రెండవరోజు నుంచి కలెక్షన్స్ 3 కోట్ల వరకు అందుకోవడం స్టార్ట్ చేసింది.
7 రోజుల కలెక్షన్స్..
ఎడవరోజు కూడా 1.78కోట్ల షేర్స్ తో ఇంకా బలంగా మారింది.ఇక మొదటి ఏడు రోజుల్లో సినిమా అందించిన మొత్తం కలెక్షన్స్ 21.42 కోట్లు. అంటే ఇప్పటివరకు వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ 35.32కోట్లు. ఈ లెక్కలు చూస్తుంటే మాస్ రాజా మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదని అర్థమవుతొంది. థియేటర్స్ 50% ఆక్యుపెన్సీతోనే నడిచినా కూడా ప్రభావం కొంత కూడా పడలేదు.
ప్రభాస్ - రాకీ భాయ్: Salaar Movie Pooja & Launch Photos
లాభం ఎంత వచ్చిందంటే..
చూస్తుంటే కలెక్షన్స్ డోస్ ఇప్పట్లో తగ్గేలా లేదని అర్ధమవుతోంది. ఇక ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడికి లాభం ఎంత వచ్చిందనే విషయంలోకి వెళితే.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 16.02కోట్లు అందుకుంటే చాలు. కానీ ఇప్పుడు 21కోట్లు షేర్స్ వచ్చాయి. అంటే 5కోట్ల వరకు ప్రాఫిట్ వచ్చినట్లే. ఇక ఆదివారం నుంచి థియేటర్స్ సంఖ్య పెరగనుంది కాబట్టి సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
రెమ్యునరేషన్ తీసుకోలేదట
మరోక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ సినిమాకు మాస్ రాజా ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. గత సినిమాల ప్రభావం వలన నిర్మాతలు మాస్ రాజాతో చాలా వరకు సినిమాలు చేయడానికి ఇష్టపడడం లేదట. ఇక క్రాక్ కథ నచ్చడంతో మళ్ళీ హిట్ అందుకొని ఫామ్ లోకి రావాలని రెమ్యునరేషన్ తీసుకోలేదట.
కానీ మరో విధంగా జేబులు నిండుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రవితేజ రెమ్యునరేషన్ రూ.6కోట్ల వరకు రావాల్సిందట. కానీ అలా తీసుకోకుండా సినిమా విడుదల అనంతరం నైజాం, వైజాగ్ ఏరియాల షేర్స్ అందుకోవడానికి సిద్ధమయ్యాడు. దాదాపు రెండు ఏరియాల్లో 11కోట్లకు పైగానే కెలెక్షన్స్ వచ్చాయి. ఇప్పట్లో సినిమా జోరు తగ్గేలా లేదు కాబట్టి నడిచే వరకు మాస్ రాజా ఆదాయం పెరిగుతూనే ఉంటుంది.