Just In
- 11 min ago
షూటింగ్‌కు సిద్ధమైన మహేశ్ డైరెక్టర్: ఆ తరహా కథతో ప్రయోగం చేయబోతున్నాడు
- 13 min ago
ఆ డబ్బులేవో నువ్వే ఇవ్వొచ్చు కదా?.. యాంకర్ సుమ పోస్ట్‌పై నెటిజన్ల కామెంట్స్
- 43 min ago
గ్యాప్ తర్వాత అదరగొట్టేసిన అమలా పాల్: ఆమెను అలా చూసి ఆశ్చర్యపోవడం ఖాయమట
- 55 min ago
ప్రభాస్ పేరు చెప్పి మోసం: లక్షల రూపాయలు కాజేసిన ముఠా.. ఆ ప్రొడక్షన్ హౌస్ పనే ఇదంతా
Don't Miss!
- News
ఎన్నికల వేళ కేంద్రం మరో తాయిలం -బోడో రీజియన్‌కు రూ.500 కోట్లు -అస్సాంలో అమిత్ షా ప్రకటన
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Sports
ఇంగ్లండ్ ఓపెనర్లూ.. ద్రవిడ్ సలహాలు పాటించండి: కెవిన్ పీటర్సన్
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రవితేజ క్రాక్ ప్రీ రిలీజ్ బిజినెస్.. బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేయాలంటే..
2020 మొదట్లో సంక్రాంతికి బాక్సాఫీస్ ఫైట్ ఏ రేంజ్ లో నడిచిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్, మహేష్ బాబు వారి టార్గెట్ ను చాలా సులువుగా అందుకున్నారు. ఇక నితిన్ భీష్మ సినిమాతో ఎండింగ్ టచ్ ఇచ్చినట్లయ్యింది. ఆ తరువాత కరోనా రావడంతో బాక్సాఫీస్ రికార్డుల మజా మిస్సయ్యింది. ఇక ఈ సంక్రాంతికి అందరి చూపు ఎక్కువగా రవితేజ సినిమాపైనే ఉంది. ఆ సినిమా తెలుగు స్టేట్స్ ప్రీ రిలీజ్ విషయానికి వస్తే..

ప్రస్తుతం బాక్సాఫీస్ ఆయుధం అదే..
మాస్ మహారాజా రవితేజ ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా రికార్డులను అందుకోవడం లేదు. ఎంత డిఫరెంట్ గా చేసినా కూడా వర్కౌట్ కావడం లేదు. చివరగా రాజా ది గ్రేట్ తరువాత మళ్ళీ విజయాన్ని అందుకోలేదు. ఇక ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రధాన ఆయుధం క్రాక్ అనే చెప్పాలి. ఈ సినిమాపై అభిమానుల్లో అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి.

రిలీజ్.. కాస్త ముందుగానే
క్రాక్ సినిమాను గత ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాల్సింది. కానీ లాక్ డౌన్ వల్ల లేటుగా వదలబోతున్నారు. జనవరి 9న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెన్సార్ వర్క్ కూడా ఫినిష్ అయ్యింది. మొదట జనవరి 14న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ జనాలు థియేటర్స్ కు బాగానే అలవాటు పడ్డారని ముందుగా విడుదల చేసి పాజిటివ్ టాక్ తో సంక్రాంతి కలెక్షన్స్ ను టార్గెట్ చేసినట్లు అర్ధమయ్యింది.

ఆ ఏరియాల బిజినెస్ ఎలా ఉందంటే..
ఇక సినిమా తెలుగు రాష్ట్రల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. కొన్ని చోట్ల అయితే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు నిర్మాతలు. నైజాం ఏరియాలో రవితేజకు మార్కెట్ గట్టిగానే ఉంది. ఇక్కడ రూ.4.2కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సీడెడ్ లో అయితే 2.8కోట్ల వరకు ధర పలికింది. ఎక్కువగా ఆంధ్రలో 6కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం.

మొత్తం ఎంత రాబట్టాలి అంటే..
సరైన ఫెస్టివల్ లో విడుదలవుతున్న ఈ సినిమాకు మొదటి 7రోజులు చాలా కీలకం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ప్రకారం టార్గెట్ అయితే చాలా తక్కువనే చెప్పాలి. 13.5కోట్ల వరకు రబట్టగలిగితే బ్రేక్ ఈవెన్ సాదించినట్లే. ఈ టార్గెట్ అందుకోవడం మాస్ రాజాకు పెద్ద కష్టమేమీ కాదు. పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా 25కోట్ల వరకు మొదటి వారంలోనే రాబట్టగలదని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..