»   » స్టార్ హీరోల కి...రవితేజ షాకిచ్చారు

స్టార్ హీరోల కి...రవితేజ షాకిచ్చారు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్: సాధారణంగా శుక్రవారం లేదా గురువారం విడుదలైన సినిమా వీకెండ్ లు శనివారం, ఆదివారం కలెక్షన్స్ దాటాక ..వచ్చే సోమవారం కలెక్షన్ ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి అది రాబోయో రోజుల్లో స్టడీగా ఉండబోతుందా లేదా అన్నది లెక్కలు వేస్తూంటారు. ఈ విషయంలో భాక్సాఫీస్ వద్ద రవితేజ షాక్ ఇచ్చారు. మొదటి సోమవారం రవితేజ పవర్ చిత్రం కలెక్షన్స్ తో ట్రేడ్ పండితులందరినీ ఆశ్చర్యపరిచారు. ఆగడు, రభస ని దాటి నైజాం ఏరియాలో కలెక్షన్స్ ని ఇది సంపాదించింది. ట్రేడ్ సమాచారం ప్రకారం... రిలిజైన వీకెండ్ తర్వాత సోమవారం నైజాం ఏరియాలో... 80 లక్షలు సంపాదించిందని సమాచారం.

    అదే నైజాం ఏరియాలో...సెకండ్ ప్లేస్ లో ... మొదటి సోమవారం రభస చిత్రం 59 లక్షలు సాధించింది. అల్లుడు శీను చిత్రం మొదటి సోమవారం రోజు 43 లక్షలు సంపాదించింది. అయితే మహేష్ బాబు ఆగడు మాత్రం కేవలం 42 లక్షలు మాత్రమే సాధించి, అభిమానులను నిరాశపరిచింది. మహేష్ మ్యాజిక్ పనిచేయటం లేదా అనే సందేహాలు తీసుకువచ్చింది.

    Raviteja's 'power' Shock to Aagadu

    ఇక ఏ హీరోకి అయినా మొదటి వారం కలెక్షన్స్ ఎప్పుడూ కీలకమే. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు అవి మరింతగా పరిగణనలోకి తీసుకుంటారు. సినిమా రిజల్ట్ కి సంభంధం లేకుండా కలెక్షన్స్ ఉంటే...వారి స్టార్ డమ్ భాక్సాఫీస్ వద్ద పనిచేస్తున్నట్లు లెక్క. టాక్ కి సంభంధం లేకుండా ప్రేక్షకులు ఒకసారైనా వీరి సినిమాలు చూడాలనుకుంటారు. అలాగే అభిమానులు సైతం వీరి సినిమాలకు అండగా నిలుస్తూంటారు. అయితే ఈ లెక్కలన్నీ ఆగడు చిత్రానికి మాయమవటం ట్రేడ్ లో అందరినీ ఆశ్చర్యంలో పడేస్తోంది.

    English summary
    Raviteja dominated the mighty Nizam area collections on the First Monday with his 'Power'.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more