Razakar Closing Collections 45 కోట్ల బడ్జెట్.. డిజాస్టర్‌ కా బాప్.. ఎన్ని కోట్ల నష్టమంటే?

దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత కూడా నిజాం రాజరిక పాలనలో హైదరాబాద్ స్టేట్‌ ఉండటం, వారి సైన్యాధ్యక్షుడు ఖాసీ రజ్వీ అరాచకాలు కొనసాగడం కొనసాగింది. అయితే హిందువులపై రజాకార్స్ చేసిన దాడులు, విధ్వంసాలపై తిరుగుబాటు చేస్తూ నిజాం పాలనపై అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన సైనిక చర్య నేపథ్యంగా రజాకార్ సినిమా రూపొందించారు. హైదరాబాద్ స్టేట్‌ను నిజాం పాలన నుంచి విమోచనం కల్పించిన సినిమా ఇటీవల రిలీజైంది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ఏ మేరకు ప్రభావం చూపించింది? ఎంత కలెక్షన్లు సాధించింది అనే వివరాల్లోకి వెళితే..

రజాకార్ చిత్రాన్ని భారీ తారాగణం, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్‌తో గ్రాండ్‌గా రూపొందించారు. తెర మీద సన్నివేశాలు సజీవంగా చిత్రీకరించేందుకు భారీగా ఖర్చు చేశారు. ఈ సినిమాను సుమారుగా 45 కోట్ల రూపాయలతో రూపొందించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ మూవీని ప్యాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, మరాఠీ, కన్నడ, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు.

Razakar Closing Collections Worldwide Highly technical movie not Impressive the box office

రజాకర్ సినిమాకు చేసిన ప్రమోషన్స్ మంచి స్పందన రావడంతో సుమారుగా 600 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రానికి సినీ విమర్శకుల నుంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. అయితే సానుకూలమైన టాక్ వచ్చినా.. థియేటర్‌కు ప్రేక్షకులను రప్పించడంలో యూనిట్ విఫలమైంది. దాంతో భారీ విజయం సాధిస్తుందనే అంచనాలను ఈ సినిమా తలకిందులు చేసింది.

రజాకార్ చిత్రం బాక్సాఫీస్‌పై ప్రభావం చూపకపోవడంతో ఈ సినిమా అంతంత మాత్రంగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ ఇండియా వైడ్ తొలి రోజు 40 లక్షలు, రెండో రోజు 50 లక్షలు, మూడో రోజు 50 లక్షలు, నాలుగో రోజు 30 లక్షలు, ఐదో రోజు 31 లక్షలు, ఆరో రోజు 52 లక్షల రూపాయలు, 7వ రోజు 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో తొలివారం 3 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

Razakar Closing Collections Worldwide Highly technical movie not Impressive the box office

ఇక రెండోవారంలో కూడా ఈ సినిమా నిలకడగా వసూళ్లను సాధించలేకపోయింది. 8వ రోజు 20 లక్షలు, 9వ రోజు 20 లక్షలు, 10వ రోజు 25 లక్షలు, 11వ రోజు 25 లక్షల రూపాయలు వసూలుచేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 4 కోట్ల రూపాయలు నికరంగా కలెక్షన్లను రాబట్టింది.

ఇక అన్ని భాషల్లో ఈ చిత్రం వసూలు చేసిన వివరాల్లోకి వెళితే.. తెలుగులో 3 కోట్ల రూపాయలు, కన్నడలో 25 లక్షలు, హిందీలో 50 లక్షలు, మలయాళంలో 4 లక్షలు, తమిళంలో 15 లక్షలు వసూలు చేసింది. అయితే ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకోవడంతో బ్రేక్ ఈవెన్‌ను 20 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. దాంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలతో ముగిస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X