Razakar Collections 45 కోట్ల బడ్జెట్.. సూపర్ హిట్ టాక్.. కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?
నిజాం పాలన నుంచి హైదరాబాద్ స్టేట్‌ను విముక్తి కలిగించిన ఆపరేషన్ పోలో బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన రజాకార్ సినిమా మార్చి 15 తేదీన రిలీజ్ అయింది. సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను గూడూరు నారాయణ రెడ్డి నిర్మించగా, యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వ్యక్తం చేసుకొంటున్నది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాల్లోకి వెళితే..
నిజాం 7వ రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో సైన్యాధ్యక్షుడు ఖాసీం రజ్వీ సేనలు దుర్మార్గాలు, హిందువులను ముస్లీం మతంలో బలవంతంగా మార్పిడి చేయడం, అలాగే రజ్వీ సేనలు రజాకార్లు సాగించిన దమనకాండను ఆపేందుకు అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సైనిక చర్య నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు. భారత సేనల ఆక్రమణతో నిజాం రాజు ప్రభుత్వానికి లొంగిపోయి హైదరాబాద్ స్టేట్‌ను ఇండియాలో విలీనం చేయడం ఈ సినిమా కథగా తెరకెక్కించారు.

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ మూవీని తెలుగు, హిందీ, మరాఠీ, కన్నడ, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా కథకు మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాలతో లింక్ ఉండటంతో ఆ రాష్ట్రాల్లో కూడా భారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 600 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు తెలిసింది.
రజాకర్ సినిమాను అత్యంత సాంకేతికతతో, వీఎఫ్ఎక్స్ వర్క్‌తో తెరకెక్కించారు. టాలెంటెడ్ యాక్టర్లు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. ఈ సినిమాను సుమారుగా 45 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకోవడంతో బ్రేక్ ఈవెన్‌ను 20 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు.

రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. సినీ క్రిటిక్స్‌తోపాటు సాధారణ ప్రజలు కూడా సానుకూలంగా స్పందించారు. దాంతో ఈ సినిమా స్లోగా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమాకు సుమారుగా 30 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది. అయితే మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే ఈ సినిమా కలెక్షన్లు, ఆక్యుపెన్సీ ఊపందుకొనే అవకాశం ఉంది.
ఇక రజాకార్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అలాగే కన్నడ, ఇతర ప్రాంతాల్లో ఈ సినిమా మొత్తంగా 50 లక్షలు కలెక్ట్ చేస్తుందని పేర్కొన్నాయి. మొత్తంగా ఈ సినిమా తొలి రోజు 1.75 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది.
ఇక రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. దారుణంగా వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మిగితా ప్రాంతాల్లో పెద్దగా కలెక్షన్లు నమోదు కాలేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
ఇక మూడో రోజు ఆదివారం వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా ఆదివారం నుంచి మౌత్ టాక్‌తో పుంజుకొంటే వసూళ్లు గాడిన పడే ఛాన్స్ కనిపిస్తున్నది. ఈ సినిమా ఆదివారం మరో 50 లక్షల రూపాయలు వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











