Razor Day 1 Collections: రేజర్ తొలిరోజు కలెక్షన్స్.. రవిబాబు మూవీ బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటీ?
సీనియర్ నటుడు చలపతిరావు నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవిబాబు ... నటుడిగా, కమెడియన్‌గా, విలన్‌గా తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్రవేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్న జోనర్స్‌లో సినిమాలు తీయగల అరుదైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రవిబాబు. క్రైమ్, హార్రర్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ ఇలా అన్ని జోనర్స్‌లో సినిమాలు తీశారు. చాలా రోజుల తర్వాత ఆయన నటించి, దర్శకత్వం వహించిన మూవీ రేజర్.. సమ్మర్ కానుకగా మే 8న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో రేజర్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
రేజర్ తారాగణం
రేజర్ మూవీని ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రవిబాబు స్వయంగా నిర్మించగా.. సురేష్ ప్రొడక్షన్స్ ప్రెజెంటర్‌గా వ్యవహరించింది. యాక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రణవి మానుకొండ, నాజర్, ప్రదీప్ ఆంటోనీ, దావూది జివాల్, తనీష్, ఇనయా సుల్తానా తదిరులు కీలకపాత్రలు పోషించారు. కొంతకాలంగా ఎలాంటి సినిమాలు తీయకుండా గ్యాప్ తీసుకున్న రవిబాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. అలాగే రేజర్ మూవీ కోసం ఎలాంటి ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం తన ఇంటర్వ్యూలు, పాడ్‌కాస్ట్‌లతోనే హైప్ తీసుకొచ్చారు రవిబాబు.

రేజర్ బిజినెస్ అండ్ బ్రేక్ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి రేజర్ మూవీకి 8 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ అత్యున్న నిర్మాణ విలువలు, సినిమాటిక్ అనుభూతి కోసం నిర్మాతలు బాగానే ఖర్చు చేశారు. రేజర్ సినిమా లాభాల్లోకి రావాలంటే 9 కోట్ల రూపాయల షేర్, 17 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు నిర్దేశించారు.
రేజర్ కథ ఏంటీ?
ఇప్పటి వరకు డిఫరెంట్ జోనర్స్‌లో సినిమాలు చేస్తూ వచ్చిన రవిబాబు.. ఫస్ట్ టైం పొలిటికల్, రివేంజ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దర్శకత్వంతో పాటు తనే లీడ్ రోల్‌లో నటించారు. సీఎం కూతురిని అతని ప్రత్యర్ధుల నుంచి కాపాడే సామాన్యుడి రోల్‌లో రవిబాబు నటించారు. రవిబాబు ఆ పాపని ఎలా కాపాడాడు? అసలు రేజర్ అంటే ఏమిటీ? హోంమంత్రి, అతని కొడుకు నుంచి హీరో రవిబాబు ఎలాంటి ప్రతిఘటన ఎదుర్కొన్నాడు? అనేదే ఈ సినిమా కథ.
రేజర్ తొలిరోజు కలెక్షన్స్
రవిబాబు ఇంటర్వ్యూల కారణంగా ఓ మాదిరిగా రేజర్ మూవీపై బజ్ నెలకొంది. రిలీజ్ రోజు ఈ సినిమాకు బుక్ మై షోలో 1.1కే టికెట్లు అమ్ముడైనట్లుగా గణాంకాలు చెబుతున్నారు. మార్కెట్‌లో సినిమాలు లేకపోవడంతో ఏ మాత్రం టాక్ బాగున్నా రేజర్‌కి మంచి వసూళ్లు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు తొలిరోజు వరల్డ్ వైడ్‌గా కోటి రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ రావొచ్చని భావిస్తున్నారు. మరి చాలా రోజుల తర్వాత నటుడిగా, దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రవిబాబు.. తన రేజర్ మూవీతో ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications


