twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RC15: కళ్ళు చెదిరే ధరకు అమ్ముడైన రామ్ చరణ్ సినిమా.. ఒక్క డీల్ తో టెన్షన్ పోగొట్టుకున్న నిర్మాత

    |

    ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే పెరుగుతున్న ప్రమోషన్స్ బట్టి ఒక మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది. అయితే ఇటీవల కాలంలో మాత్రం కాంబినేషన్ సెట్ అవ్వగానే పాస్ ప్రాజెక్టుపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమా పై కూడా అదే తరహాలో అంచనాలు పెరుగుతున్నాయి. RC 15వ ప్రాజెక్టు పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకుడు శంకర్ ఎప్పటిలానే చాలా కాస్ట్లీ గా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

    Recommended Video

    Actor Kamal Haasan Tests Covid Positive || Filmibeat Telugu

    అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం మొదట శంకర్ అంచనాలకు తగ్గట్టుగానే వెళ్లినప్పటికీ ఇప్పుడు మాత్రం రిస్కు చేయలేకపోతున్నాడు. సినిమా కు సంబంధించిన రిలీజ్ డిజిటల్ శాటిలైట్ హక్కులను ఒక సంస్థకు భారీ ధరకు అమ్మేశాడని తెలుస్తోంది.

     మళ్ళీ వెనక్కి తగ్గకూడదని

    మళ్ళీ వెనక్కి తగ్గకూడదని

    రామ్ చరణ్ RRR సినిమా తర్వాత కుడా వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టాలని చూస్తున్నాడు. ఒక్కసారి పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గకూడదని ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఆలోచిస్తున్నారు. అదే తరహాలో రామ్ చరణ్ కూడా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలి అని శంకర్ సినిమాతో సిద్ధమవుతున్నాడు. RRR తో వచ్చే క్రేజ్ ను ఆ తరువాత ప్రాజెక్టులకు కూడా యుజ్ అయ్యే విధంగా ప్రణాళికలు రచిస్తున్నాడు.

    భారీగా ఖర్చు పెట్టిస్తున్న శంకర్

    భారీగా ఖర్చు పెట్టిస్తున్న శంకర్

    రామ్ చరణ్ ప్రస్తుతం ఎలాంటి కథలను ఓకే చేసినా కూడా అన్ని భాషల వారికి నచ్చే విధంగా ఉండేలా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్టు కూడా నేషనల్ పొలిటికల్ డ్రామా గా ఉండబోతోందని సమాచారం. అలాగే సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయట. ముఖ్యంగా ఒక ట్రైన్ సీన్ కోసం అయితే దర్శకుడు శంకర్ ఏకంగా పది కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే అంతకు ముందే కేవలం పోస్టర్స్ కోసమే 70 లక్షల వరకు ఖర్చు అయినట్లు సమాచారం

    జీ స్టూడియోస్ లో RC 15

    జీ స్టూడియోస్ లో RC 15

    శంకర్ తో సినిమా అంటే చాలా వరకు నిర్మాతల్లో లెక్కలు ఊహకందని రేంజ్ లో ఉంటాయి. అయితే దిల్ రాజు కూడా ముందుగానే ఆలోచించి శంకర్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన శంకర్ లెక్కలను ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మరో నిర్మాణ సంస్థకు అమ్మేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నిర్మాణ సంస్థ మరేదో కాదు జీ స్టూడియోస్ అని కూడా కథనాలు వెలువడుతున్నాయి.

    సింగిల్ డీల్ తో ఫుల్ హ్యాపీ

    సింగిల్ డీల్ తో ఫుల్ హ్యాపీ

    జి స్టూడియోస్ రామ్ చరణ్ 15వ సినిమా రిలీజ్ హక్కులతో పాటు డిజిటల్ శాటిలైట్ హక్కులను కూడా రౌండ్ ఫిగర్ నెంబర్ తో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా మొత్తం దాదాపు 350 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసే పట్టు దొరకకపోవడంతో జీ స్టూడియోస్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరి RC 15 పాన్ ఇండియన్ మార్కెట్ కు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అందుకుంటుందో లేదో చూడాలి. ఇక 2023 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.

    English summary
    RC 15 Digital, Theatrical, Satellite rights sold to Zee Studios for 350 crore,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X