RDX Movie Collectionsకింగ్ ఆఫ్ కోతాను దెబ్బ కొట్టిన ఆర్డీఎక్స్ మూవీ..బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
బాక్సాఫీస్ వద్ద RDX మలయాళ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తూ కలెక్షన్లను నమోదు చేసింది. షేన్ నిగమ్, ఆంటోని వర్గీస్, నీరజ్ మాధవ్, మహిమా నంబియార్, ఐమా సెబాస్టియన్, లాల్, బాబు ఆంటోన, మాలా పార్వతి నటించిన ఈ చిత్రానికి నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. వీకెండ్ బ్లాక్ బస్టర్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి సోఫియా పాల్ నిర్మాతగా వ్యవహరించారు. ఆగస్టు 25వ తేదీన రిలీజైన ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
మలయాళం సినిమా మేకింగ్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే.. RDX మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను సుమారు 10 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేయడంతో సినిమాను భారీగా థియేట్రికల్ రిలీజ్ చేశారు. మలయాళంలో సుమారు 600 స్క్రీన్లు, దక్షిణాది, ఇతర ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో 100 స్క్రీన్లతో కలిపి ఈ సినిమాను మొత్తంగా 900 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

RDX మూవీ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు అంతగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. మొదటి రోజు సాధారణంగానే వసూళ్లను సాధించింది. ఫస్ట్ డే 1.2 కోట్ల వసూళ్లను రాబట్టింది. హిట్ టాక్ రావడం, మౌత్ పబ్లిసిటీ పెరగడంతో ఇక రెండో రోజు దాదాపు రెండింతల కలెక్షన్లు పెరిగాయి. రెండో రోజు 2.2 కోట్ల వసూళ్లను సాధించాయి. ఇక మూడో రోజు ఈ సినిమా స్టడీగా వసూళ్లను సాధించింది. రెండు రోజుల కంటే ఎక్కువగా మూడో రోజు 2.85 కోట్లు రాబట్టింది. మూడు రోజుల్లో ఈ చిత్రం 6.2 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.
RDX మూవీ నాలుగో రోజు కూడా భారీ వసూళ్లను సాధించనున్నది. ఈ చిత్రం మార్నింగ్ షోకు 55 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీ 70 శాతం ఆక్యుపెన్సీ, ఫస్ట్ షోకు 80 శాతం, సెకండ్ షోకు 80 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. కొట్టాయంలో అత్యధికంగా 97 శాతం, కోచిలో 84 శాతం, కోజికోడ్‌లో 76 శాతం, త్రిచూరులో 82 శాతం, కొల్లాంలో 86 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

RDX మూవీ నాలుగో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా స్టడీగా వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 2.75 కోట్ల నుంచి 3 కోట్ల వసూళ్లను సాధించే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా ఇండియాలో 9 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.
ఇక RDX మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ఇండియాలో 9 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో మరో 3 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రం రానున్న రోజుల్లో భారీగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కోతా సినిమా డిజాస్టర్ కావడంతో RDX మూవీకి మంచి క్రేజ్ ఏర్పడింది.


Click it and Unblock the Notifications











