ప్రభాస్ ‘రెబల్’ ఫస్ట్ డే ఏపీ కలెక్షన్స్
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రెబల్' చిత్రం నిన్న గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. తొలి రోజు ఈచిత్రం ఏపీలో భారీ కలెక్షన్స్ సాధించింది. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం తొలి రోజు ఒక్క ఏపీలోనే రూ. 7.06 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కర్నాటక, తమిళనాడు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలెక్షన్ల వివరాలు కలుపుకుంటే ఈ మొత్తం రూ. 9 కోట్లు ఉంటుందని అంచనా. ప్రభాస్ కెరీర్లోనే ఇది రికార్డుగా చెబుతున్నారు.
ఫస్ట్ డే ఏపీ కలెక్షన్స్ వివరాలు..
నైజాం: రూ 2.15 కోట్లు
సీడెడ్: రూ. 1.65 కెట్లు
గుంటూరు: రూ. 80 లక్షలు
వైజాగ్: రూ. 70 లక్షలు
ఈస్ట్ గోదారవి: రూ. 57 లక్షలు
వెస్ట్ గోదావరి: రూ. 46 లక్షలు
కృష్ణ: రూ. 42 లక్షలు
నెల్లూరు: రూ. 33 లక్షలు
టోటల్ ఏపీ షేర్: రూ. 7.06 కోట్లు
డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ రెండు క్లాస్ సినిమాలే. చత్రపతి తరువాత సరైన మాస్ సినిమా లేని ప్రభాస్ మాస్ ఆడియెన్స్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ లారెన్స్ కలిసి చేసిన సినిమా రెబల్. ప్రభాస్ కి జోడీగా తమన్నా, దీక్ష సేథ్ నటించిన ఈ సినిమాకి కథ, కథనం, సంగీతం, కొరియోగ్రఫీ, దర్శకత్వం అన్ని విభాగాల్ని లారెన్స్ నిర్వహించాడు.
ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.


Click it and Unblock the Notifications











