Kalki 2898 AD: కల్కితో ప్రభాస్ ఆరు సెంచరీలు.. ఏకైక హీరోగా దిమ్మతిరిగే రికార్డు

తమ తమ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో ఇప్పుడు చాలా మంది హీరోలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ పేరు ముందుగా చెప్పాలి. అంతలా ఈ బడా హీరో సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అదే సమయంలో తన రేంజ్‌ను కూడా పెంచుకుంటూ ముందుకు సాగుతోన్నాడు. ఈ జోష్‌లోనే ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి భారీ రెస్పాన్స్ రావడంతో తాజాగా ఓ రికార్డు నమోదైంది. ఆ సంగతులు మీరే చూడండి!

ప్రభాస్ విశ్వరూపంతో

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమానే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు ఇందులో నటించారు.

Rebel Star Prabhas Created History In Hindi With Kalki 2898 AD Movie

వరల్డ్ వైడ్‌గా ట్రెండ్
భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న 'కల్కి 2898 ఏడీ' మూవీ గత గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8500లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు. దీంతో ఈ సినిమా హడావిడి భారీ స్థాయిలో కనిపిస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్‌లో సైతం ప్రభాస్ సినిమా షేక్ చేసేసింది. ఫలితంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.

Rebel Star Prabhas Created History In Hindi With Kalki 2898 AD Movie

600 కోట్లకు చేరువగా

టైం ట్రావెల్ కథతో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వచ్చింది. దీంతో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత కూడా ఇదే హవాను చూపిస్తోంది. ఫలితంగా ఈ మూవీ రూ. 600 కోట్లకు చేరువగా వచ్చింది.

హిందీలోనూ భారీగానే
మల్టీస్టారర్ జోనర్‌లో వచ్చిన 'కల్కి 2898 ఏడీ' సినిమా కోసం దేశ వ్యాప్తంగా బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో దీన్ని హిందీలో కూడా అత్యధిక థియేటర్లలో తీసుకు వచ్చారు. అనుకున్నట్లుగానే అక్కడ కూడా ఇది మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇలా నాలుగు రోజుల్లోనే వంద కోట్ల నెట్ మార్కును దాటేసింది. ఇక, ఐదు రోజుల్లో ఈ చిత్రం రూ. 128 కోట్లు వరకూ కలెక్ట్ చేసుకుంది.

Rebel Star Prabhas Created History In Hindi With Kalki 2898 AD Movie

హిందీలో కొత్త రికార్డ్

'కల్కి 2898 ఏడీ' మూవీ హిందీలో దిమ్మతిరిగే స్పందనను అందుకుంటోంది. ఫలితంగా ఇది ఇప్పటికే వంద కోట్ల క్లబ్‌లో సైతం చేరింది. తద్వారా 'బాహుబలి 1', 'బాహుబలి 2', 'సాహో', 'ఆదిపురుష్', 'సలార్' తర్వాత ఈ మార్క్ చేరిన 6వ ప్రభాస్ చిత్రంగా నిలిచింది. దీంతో ఇన్ని సార్లు 100 కోట్లు కొట్టిన ఏకైక సౌతిండియన్ హీరోగా అతడు రికార్డు సాధించాడు.

More from Filmibeat

Read more about: kalki 2898 ad prabhas nag ashwin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X