రేణూదేశాయ్ ఇంపార్టెంట్ ఎనౌన్స్ మెంట్
హైదరాబాద్: రేణు దేశాయ్ సినిమా విడుదల గురించి మరాఠివాళ్లే కాకుండా ఇక్కడి పవన్ అభిమానుల కూడా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా సినిమా వాయిదా పడింది. అక్టోబర్ 10న విడుదల అవుతుందనుకున్న ఈ చిత్రం అక్టోబర్ 17కి వెళ్లింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.
రేణు దేశాయ్ ట్వీట్ చేస్తూ...
"ముఖ్యమైన ప్రకటన. ఇష్క్ వాలా లవ్ చిత్రం తెలుగు వెర్షన్ రిలీజ్ తేదీ మారింది. అక్టోబర్ 17 న విడుదల చేస్తున్నాము. మీరు అక్టోబర్ 17న థియోటర్ లో చూడవచ్చు ," అన్నారామె.

'ఇష్క్ వాలా లవ్' చిత్రం కథ,మాటలు స్వయంగా రేణునే అందించి తెరకెక్కించింది. ఈ కథ ఓ జంట కు చెందింది. ఇందులో ఓ సెంటిమెంటల్ కుర్రాడికి, క్రేజీ అమ్మాయికి జరిగే లవ్ స్టోరీ. ఈ పాత్రల వైరుధ్యాలే చిత్రానికి ప్రాణం అని చెప్తున్నారు. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్బింగ్ చేయనుంది. ఇందులో ఓ స్పెషల్ ఎట్రాక్షన్ ఉంది. అది మరేదో కాదు...
ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌ల కుమారుడు అకిరా నందన్ ముఖానికి రంగేసుకున్నాడు. తన తల్లి రేణుదేశాయ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మరాఠీ చిత్రం 'ఇష్క్ వాలా లవ్'లో అకిరా అతిథి పాత్రల్లో మెరవబోతున్నాడు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రేణుదేశాయ్ ట్విట్టర్‌లో ద్వారా ప్రకటించారు.
''నేను ముందుగా మాట ఇచ్చినట్లు ఈ రోజు తీపి కబురు చెబుతున్నా. నా కొడుకు అకిరా నందన్ 'ఇష్క్ వాలా లవ్'లో అతిథి పాత్ర పోషిస్తున్నాడు. ఓ తల్లిగా నా కొడుకుని డైరక్ట్ చేయడం ఆనందంగా ఉంది'' అంటూ రాసుకొచ్చారు రేణు దేశాయ్. ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తామని ఇదివరకే రేణు దేశాయ్ చెప్పారు. అంటే అకిరా నటనను తెలుగు తెరపైనా చూసే అవకాశముంది.


Click it and Unblock the Notifications











