Acharya advance booking report కేజీఎఫ్2 దాటేసిన ఆచార్య.. నైజాం కింగ్‌గా చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం అడ్వాన్స్ బుకింగ్ విషయంలో మిశ్రమ స్పందన కనిపించింది. అయితే రిలీజ్ రోజు వరకు ఆ టాక్‌ను సానుకూలంగా మార్చుకొని భారీగా వసూళ్లను నమోదు చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ పరిస్థితి ఎలా ఉందంటే..

దేశవ్యాప్తంగా ఎన్ని షోలు అంటే..
ఆచార్య సినిమా విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా 3129 షోలు ప్రదర్శిస్తున్నారు. యావరేజ్‌గా 60 శాతం బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చింది. తెలుగు వెర్షన్ ఆచార్య చిత్రం తొలి రోజున అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 13.2 కోట్లు సాధించింది. ఇక కేజీఎఫ్ 2080 షోల ద్వారా 11.16 కోట్లు రాబట్టింది.

తెలంగాణలో మొత్తంగా షోలు
ఆచార్య చిత్రం నైజాంలో భారీగా కుమ్మేసింది. తెలంగాణలో మొత్తంగా 649 షోలు ప్రదర్శించనున్నారు. టికెట్ రేట్లు పెంచడం ఈ సినిమా అనుకూలంగా మారింది. మల్టీప్లెక్స్‌లో 500, 410, 354 రూపాయలు ఉండగా. సింగిల్ థియేటర్‌లో 210, 150, 90 రూపాయలుగా టికెట్ రేట్‌ను నిర్ణయించారు. తొలి రోజున అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 5.9 కోట్లు రాబట్టింది.

అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ రిపోర్ట్
అమెరికాలో ఆచార్య చిత్రం రికార్డుస్థాయి స్క్రీన్లలో రిలీజ్ అయింది. 306 లొకేషన్లలో 962 షోలు ప్రదర్శించారు. తొలి రోజున 20 వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో తొలి రోజు సుమారు 500k డాలర్ల కలెక్షన్లు వసూలు అయ్యాయి. తొలి రోజు ప్రీమియర్స్ తర్వాత ఈ చిత్రం 650k డాలర్ల కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉంది.

హైదరాబాద్ సిటీలో
హైదరాబాద్ సిటీలో ఆచార్య చిత్రం భారీగా కలెక్షన్లను తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్ భారీగా పోటెత్తారు. హైదరాబాద్‌లో ఈ చిత్రం 4.27 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
Recommended Video


దక్షిణాదిలో చెన్నై, బెంగళూరులో
ఇక దక్షిణాదిలో కూడా ఓ మోస్తారు వసూళ్లతో సినిమా బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. ఈ చిత్రం 24 లక్షల రూపాయలను చెన్నైలో రాబట్టింది. ఇక బెంగళూరులో ఈ చిత్రం 1.18 కోట్లను వసూలు చేసింది. కరెంట్ బుకింగ్‌తో కలిపి కర్ణాటకలో తొలి రోజు భారీగా వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











