Resu Gurram Re Release Collections: రేసు గుర్రం లైఫ్ టైమ్ కలెక్షన్లు ఎంత? అల్లు అర్జున్ మూవీ రీరిలీజ్ వసూళ్లు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రం చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు వక్కంత వంశీ కథను అందించారు. వేమా రెడ్డి డైలాగ్స్ అందించిన ఈ సినిమాకు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వెంకటేశ్వరరావు నిర్మాతగా వ్యవహించారు. ఈ చిత్రంలో శృతిహాసన్, శ్యామ్, రవికిషన్ తదితరులు నటించారు.

ఈ సినిమాకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా, గౌతమ్ రాజు ఎడిటర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్ థమన్ వ్యవహించారు. శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా 2014 సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా మరోసారి రిలీజ్ అవుతున్నది. ఈ మూవీ రీ రిలీజ్ గురించిన వివరాల్లోకి వెళితే..

Resu Gurram Re Release Box Office Collections

అల్లు అర్జున్ కెరీర్‌లో ఆ సమయంలో భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందింది.ఈ చిత్రం కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాకు 55 కోట్ల బడ్జెట్ అయింది. ఈ చిత్రం 57 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

అయితే ఈ సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో స్టైలిష్ స్టార్ కెరీర్‌లో రికార్డు వసూళ్లను సాధించడమే కాకుండా తన కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో సుమారుగా 70 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఏపీ, తెలంగాణలో 50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 6 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమా రీ రిలీజ్‌కు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్‌ను ఇటీవల ప్రారంభించారు. ఈ చిత్రానికి మంచి స్పందన బాక్సాఫీస్ వద్ద లభిస్తున్నది. ఈ చిత్రం ఇప్పటికే 50 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా రానున్న రోజుల్లో భారీగా వసూళ్లను రాబడుతుంది. ఈ చిత్రం రీ రిలీజ్‌కు 2 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బరిలోకి దిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X