వివాదాస్పద చిత్రం 'సారీ టీచర్' కి థియేటర్స్ దెబ్బ

By Srikanya

హైదరాబాద్: ఆర్యమన్, కావ్యాసింగ్ జంటగా సూర్యలోక్ ఫిలిమ్స్ ఫ్యాక్టరీ నిర్మించిన చిత్రం 'సారీ టీచర్' . ఈ చిత్రం చట్టపరంగా వచ్చిన అన్ని అవరోధాలను తొలగించుకుని మొన్న శుక్రవారం విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంకి హైదరాబాద్ సిటీలో ఎక్కడా థియేటర్స్ దొరకలేదు. కేవలం హైదరాబాద్ అవుట్ స్కట్ లోని కొంపల్లె సిని ప్లానెట్ లో మాత్రమే ఈ చిత్రం విడుదలైంది. దీనికి కారణం అదే రోజు రిలీజన విక్రమ్ శివ తాండవం,శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రాలు అధ్యధిక థియేటర్స్ ఆక్రమించటమే.

అలాగే అంతకు ముందు విడుదలైన రెబెల్,లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, షిర్డీ సాయి చిత్రాలు ఓ ప్రక్కన ఇంకా ఎక్కువ థియేటర్స్ లో ఆడుతున్నాయి. ఈ నేఫధ్యంలో 'సారీ టీచర్' సినిమా సిటీ ప్రేక్షకులు ఎవరికీ అందుబాటులో లేదు. పోస్టర్స్, ప్రోమోలు చూసి ఉత్సాహం తెచ్చుకున్న వారికి నిరుత్సాహం ఎదురైంది. ఇక జిల్లా హెడ్ క్వార్టర్స్ లో విడుదలైన ఈ చిత్రం అక్కడా పెద్దగా వసూళ్లు సాదించలేకపోయింది. కాంట్రావర్శి క్రియేట్ చేసిన వారంలోనే ఈ చిత్రం విడుదలై ఉంటే ఫలితం ఉండేది అని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

శ్రీసత్య 'సారీ టీచర్' చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ-''టీచర్‌ని ఓ స్టూడెంట్ ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో ఈ సినిమా రూపొందించాను. ఇందులో స్టూడెంట్ చూడకూడనివి చూస్తూ, చేయకూడనివి చేస్తూ, అనకూడనివి అంటూ చివరకు 'సారీ టీచర్' అంటుంటాడు. టీచర్‌ని ప్రేమలో పడేయడానికి స్టూడెంట్ చేసిన ప్రయత్నాలేంటి? అతని ప్రయత్నం సఫలం అయ్యిందా? అనే ప్రశ్నలకు సమధానమే మిగిలిన కథ''అని తెలిపారు.

ఈ సినిమాలో టీచర్‌గా కావ్యాసింగ్, ఆర్యమన్ స్టూడెంట్‌గా నటించారు. వీరిద్దరికీ ఇదే తొలి సినిమా. తన పాత్రను దర్శకుడు డిజైన్ చేసిన తీరు తనకు బాగా నచ్చిందని, ప్రేక్షకులతో కలిసి ఈ చిత్రాన్ని తనూ చూడాలనే కోరికతో ఉన్నానని కావ్యాసింగ్ చెప్పారు. అయితే ఆమె కోరిక తీరే అవకాసం మాత్రం రాలేదు. ఆసక్తికరమైన సంఘటనలతో సినిమా రూపుదిద్దుకుందని, తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని దర్శకుడు చెప్పారు. శ్వేత, మేల్కొటే, కోట శంకరరావు, జాకీ, అభినయకృష్ణ, జెమిని ఫణి, పద్మాజయంతి, రేవంత్‌రెడ్డి, హర్ష, మాస్టర్ మనోజ్‌కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: జయసూర్య, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, ఫొటోగ్రఫీ: సాయి, ఎడిటర్: అర్చనా ఆనంద్, నిర్మాత: ఆనంద్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీసత్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X