Retro Vs Tourist Family: సూర్యకు సిమ్రాన్ షాక్.. రెట్రోను మించి టూరిస్ట్ ఫ్యామిలీ కలెక్షన్ల.. ఎన్ని కోట్లంటే?
తమిళంలో సూర్య నటించిన రెట్రో సినిమా, సిమ్రాన్ నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ మే 1వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయ్యాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన రెట్రో చిత్రం స్టార్ పవర్‌తో క్రేజీగా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. అయితే కంటెంట్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా పూర్తిగా పాజిటివ్ టాక్‌తో స్ట్రాంగ్‌గా వసూళ్లను రాబడుతున్నది. అయితే ఈ సినిమాల బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందనే విషయంలోకి వెళితే..
రెట్రో వర్సెస్ టూరిస్ట్ ఫ్యామిలీ
తమిళ సినిమా రంగంలో భారీ అంచనాలతో వచ్చిన రెట్రో, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటాపోటీగా నడుస్తున్నాయి. సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో వసూళ్ల యాత్రను ప్రారంభిస్తే.. సిమ్రాన్, శశికుమార్ నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ పాజిటివ్ టాక్‌తో రోజు రోజుకు పుంజుకొంటున్నది. అయితే రెట్రో సినిమా కలెక్షన్ల జోరు తగ్గితే.. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ కలెక్షన్లు పుంజుకోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల పోరు విషయానికి వస్తే..

తమిళనాడులో రెట్రో
రెట్రో సినిమా తమిళనాడులో తొలి రోజు 19 కోట్ల రూపాయలు, రెండో రోజు 8 కోట్లు, మూడో రోజు 8 కోట్లు, నాలుగో రోజు 8 కోట్లు, 5వ రోజు 3.4 కోట్లు, 6వ రోజు 2.5 కోట్లు, 7వ రోజు 1.9 కోట్లు వసూలు చేసింది. తొలి వారాంతం తర్వాత ఈ సినిమా కలెక్షన్లు క్రమేపీ తగ్గుకుండా రావడంతో గత వారం రోజుల్లో 51 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వసూలు చేసింది.
రెట్రో వరల్డ్ వైడ్
రెట్రో చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 35 కోట్లకుపైగా గ్రాస్, రెండో రోజు 11.45 కోట్లు, మూడో రోజు 15 కోట్లు, నాలుగో రోజు 15 కోట్లు, 5వ రోజు 6.5 కోట్లు, 6వ రోజు 4 కోట్ల రూపాయలు, 7వ రోజు 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా తమిళనాడులో 40 కోట్ల రూపాయలు, తమిళేతర ప్రాంతాల్లో 46 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 86 కోట్ల వసూళ్లను బాక్సాఫీస్ వద్ద రాబట్టింది.
కోలీవుడ్‌లో టూరిస్ట్ ఫ్యామిలీ
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా తొలి రోజు 2 కోట్ల రూపాయలు, రెండో రోజు 1.7 కోట్లు, మూడో రోజు 3 కోట్లు, నాలుగో రోజు 3.75 కోట్లు, 5వ రోజు 2.55 కోట్ల రూపాయలు, 6వ రోజు 2.5 కోట్ల రూపాయలు, 7వ రోజు 2.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా గత వారం రోజుల్లో నిలకడగా వసూళ్లను రాబడుతూ 18 కోట్లకుపైగా నెట్, 27 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
రెట్రో వర్సెస్ టూరిస్ట్ ఫ్యామిలీ
రెట్రో, టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా 7వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. సూర్య సినిమాపై సిమ్రాన్ సినిమా అధిపత్యాన్ని ప్రదర్శించింది. 7వ రోజు రెట్రో 1.9 కోట్ల రూపాయలు వసూలు చేస్తే.. టూరిస్ట్ ఫ్యామిలీ మాత్రం 2.4 కోట్ల రూపాయలు సాధించింది. దాంతో ఈ సూర్య సినిమాకు సిమ్రాన్ సినిమా గట్టిగానే పోటీ ఇస్తుందని సాక్ నిల్క్, ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











