Retro Day 1 Collections: రెట్రో డే1 కలెక్షన్లు.. సూర్య తడాఖా.. ఎన్ని కోట్లు వసూలైందంటే?
తమిళ స్టార్ హీరో సూర్య 'రెట్రో' చిత్రంతో తిరిగి థియేటర్లలోకి వచ్చారు. ఈ చిత్రం మే1న గ్రాండ్ గా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది. స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లపై ఈ చిత్రం రూపుదిద్దుకుంది. సూర్య, జ్యోతిక, కార్తీకేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ నిర్మాతలుగా వ్యవహరించారు. సూర్య సరసన పూజా హెగ్దే నటంచింది. జోజు జార్జి, జయరామ్ నెగెటివ్ పాత్రల్లో నటించారు. సీనియర్ హీరోయిన్ శ్రీయా శరణ్ ఇందులో ఐటెం సాంగ్ చేశారు. భారీ అంచనాలతో వచ్చిన ఇక ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? డే1 ఓపెనింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
రెట్రో చిత్రం బడ్జెట్ (Retro Budget) ఎంత?
సూర్య కెరీర్‌లో 44వ చిత్రంగా 'రెట్రో' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, సూర్య, పూజా హెగ్దే, శ్రియా శరణ్ తోపాటు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించారు. అలాగే ప్రముఖ టెక్నీషియన్లు సినిమాకు పనిచేయడం, ప్రమోషన్స్ తదితర ఖర్చులతో సినిమాకు భారీగానే ఖర్చయ్యింది. రెట్రోను దాదాపు రూ.65 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.

రెట్రో బ్రేక్ ఈవెన్ (Retro Break Even Target) టార్గెట్ ఎంత?
రెట్రో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూర్య వింటేజ్, ట్రైలర్, టీజర్, కార్తీక్ సుబ్బరాజ్ ప్రామీసింగ్ కంటెంట్ తో కోలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే చిత్రానికి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా భారీగానే వసూలైంది. తమిళనాడు రైట్స్ రూ.40 కోట్లు, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.13 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 18 కోట్లు, తెలుగులో రూ.9.50 కోట్లు చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.80.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సూర్య సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.82 కోట్ల షేర్.. రూ.165 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
రెట్రో ఓవర్సీస్ + ఇండియా ప్రీ సేల్ కలెక్షన్లు (Retro Collections)
రెట్రో చిత్రానికి 24 గంటల్లోనే కేవలం తమిళంలోనే 2 లక్షల టికెట్లు అమ్ముడు పోయాయి. ఇక ఓవర్సీస్ లో యూకేలోనే మొదటి రోజు అడ్వాన్డ్ బుకింగ్స్ ద్వారా 3200 టికెట్లు అమ్ముడు పోయాయి. 34,246 డాలర్ల వరకు వసూళ్లు సాధించింది. మరిన్ని చోట్ల నుంచి కూడా మొదటి రోజు భారీ రెస్పాన్సే సొంతమైంది. ఈ సందర్భంగా ప్రీసేల్ ద్వారా రూ.16 కోట్లకు పైనే వసూళ్లు అందాయని తెలుస్తోంది.
రెట్రో డే1 కలెక్షన్స్ (Retro Opening Day Expected Collections)
భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన రెట్రో చిత్రానికి ఓపెనింగ్ డే కలెక్షన్లు అదిరిపోయాయని తెలుస్తోంది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం.. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.41 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ముందస్తు అంచనాను వెల్లడించారు. మిగితా షోలకు సంబంధించిన కలెక్షన్లతో ఈ చిత్రానికి రూ.50 కోట్లకు పైనే గ్రాస్ అందుకుంటుందని అంటున్నారు. మొదటి రోజు థియేటర్ ఆక్యుపెన్సీ కూడా 50 శాతానికి పైగానే నమోదవడం విశేషం.


Click it and Unblock the Notifications











