Retro Day 3 Collections : రెట్రో 3 రోజుల కలెక్షన్లు.. సూర్యకు ఇలాంటి వసూళ్లా? ఎంత వసూలైందంటే?

సూర్య 'రెట్రో' చిత్రం థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. మే1న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది. స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లపై ఈ చిత్రం రూపుదిద్దుకుంది. సూర్య, జ్యోతిక, కార్తీకేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ నిర్మాతలుగా వ్యవహరించారు. సూర్య సరసన పూజా హెగ్దే నటంచింది. జోజు జార్జి, జయరామ్ విలన్ పాత్రల్లో అలరించారు. సీనియర్ హీరోయిన్ శ్రీయా శరణ్ ఐటెం సాంగ్ తో అదరగొట్టింది. ఇక ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 3 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

రెట్రో చిత్రం బడ్జెట్ (Retro Budget) ఎంత?
సూర్య 44వ చిత్రంగా 'రెట్రో' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, సూర్య, పూజా హెగ్దే, శ్రియా శరణ్ తోపాటు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించారు. ప్రముఖ టెక్నీషియన్లు పనిచేయడం, ప్రమోషన్స్ తదితర ఖర్చులతో సినిమాకు భారీగానే ఖర్చయ్యింది. రెట్రోను దాదాపు రూ.65 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.

Retro Day 3 Collections Worldwide

రెట్రో బ్రేక్ ఈవెన్ (Retro Break Even Target) టార్గెట్ ఎంత?
రెట్రోలో సూర్య వింటేజ్ లుక్, ట్రైలర్, టీజర్, కార్తీక్ సుబ్బరాజ్ ప్రామీసింగ్ కంటెంట్ తో కోలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా భారీగానే వసూలైంది. తమిళనాడు రైట్స్ రూ.40 కోట్లు, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.13 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.18 కోట్లు, తెలుగులో రూ.9.50 కోట్లు చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.80.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సూర్య సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.82 కోట్ల షేర్.. రూ.165 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

రెట్రో ఓవర్సీస్ కలెక్షన్లు (Retro Collections)
రెట్రో చిత్రానికి ప్రీ సేల్ ద్వారా ఓవర్సీస్ లో 34,246 డాలర్ల వరకు వసూళ్లు సాధించింది. ఇండియాలోనూ మొదటి రోజు భారీ రెస్పాన్సే సొంతమైంది. ఈ సందర్భంగా ప్రీసేల్ ద్వారా రూ.16 కోట్లకు పైనే వసూళ్లు అందాయి. ఇక 3రోజుల వరకు రూ.12.1 కోట్ల వరకు వసూళ్లు సాధించింది.

రెట్రో డే3 కలెక్షన్స్ (Retro Day3 Collections)
ఓపెనింగ్ డే కలెక్షన్లు అదిరిపోయాయి. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.41 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. 3వ రోజు ఈ చిత్రానికి రూ.7.71 కోట్ల నెట్ అందుకుందని సాక్ నిల్క్ గణంకాలు వెల్లడించాయి. ఓవర్సీస్ + ఇండియా వసూళ్లు కలిపి మొత్తంగా రూ.18 కోట్ల వరకు వసూళ్లు అందినట్టు తెలుస్తోంది. 3వ రోజు తమిళంలో రూ.7.05 కోట్లు, తెలుగులో రూ.67 లక్షలు, హిందీలో 3 లక్షలు వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ.48.5 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది.

Disclaimer: ఈ పేజీలోని సినిమా బాక్సాఫీస్‌ రిపోర్టులకు సంబంధించిన సమాచారం https://www.sacnilk.com/, ప్రొడక్షన్ హౌస్‌‌లు, సొషల్ మీడియా అకౌంట్లు వెల్లడించిన వివరాల ఆధారంగా పొందుపరచడం జరిగింది. సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల‌కు సంబంధించి వెల్లడించే రిపోర్టులకు ఫిల్మీబీట్ ఎలాంటి బాధ్యత వహించదు.

More from Filmibeat

Read more about: suriya Retro box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X