Retro Day 4 Collections : ఇదీ సూర్య పవర్.. రెట్రో 4రోజుల వసూళ్లు.. ఎన్ని కోట్లో తెలుసా?

'రెట్రో' చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి వచ్చారు సూర్య. తమిళంతో పాటు తెలుగు, హిందీ బెల్ట్ లోనూ సూర్యకు భారీ ఫ్యాన్ ఫాలోయిగ్ ఉంది. దీంతో ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో మే1న రెట్రో విడుదలైంది. పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది. శ్రియా శరణ్ స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక, కార్తీకేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ లు నిర్మించారు. విడుదలై తర్వాత ఈ సినిమాకు ఆశించిన మేర ఫలితం రాలేదు. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ క్రమంలో ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 4రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయి? ఇంకెంత రాబట్టాలి? అనే వివరాల్లోకి వెళితే..

రెట్రో చిత్రం బడ్జెట్ (Retro Budget) ఎంత?
సూర్య 44వ చిత్రంగా 'రెట్రో' రూపుదిద్దుకుంది. స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించడం, సూర్య, పూజా హెగ్దే, శ్రియా శరణ్ తోపాటు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించడంతో భారీగానే ఖర్చైంది. అలాగే ప్రముఖ టెక్నీషియన్లు కూడా సినిమాకు పనిచేయడం, ప్రమోషన్స్ తదితర ఖర్చులతో సినిమాకు రూ.65 కోట్ల బడ్జెట్‌ అయ్యింది.

Retro Day 4Collections Worldwide

రెట్రో బ్రేక్ ఈవెన్ (Retro Break Even Target) టార్గెట్ ఎంత?
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెట్రో చిత్రం.. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా భారీగానే వసూల్ చేసింది. తమిళనాడు రైట్స్ రూ.40 కోట్లు, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.13 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 18 కోట్లు, తెలుగులో రూ.9.50 కోట్లు.. ఇలా ప్రపంచవ్యాప్తంగా రూ.80.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక లాభాల్లోకి రావాలంటే రూ.82 కోట్ల షేర్.. రూ.165 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ నిపుణులు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను వెల్లడించారు.

రెట్రో ఓవర్సీస్ (Retro Overseas Collections)
రెట్రో చిత్రానికి రిలీజ్ కు ముందు రోజు 24 గంటల్లోనే తమిళంలో 2 లక్షల టికెట్లు అమ్ముడు పోయాయి. ఇక ఓవర్సీస్ లో మొదటి రోజు యూకేలో అడ్వాన్డ్ బుకింగ్స్ ద్వారా 3200 టికెట్లు అమ్ముడయ్యాయి. 34,246 డాలర్ల వరకు వసూళ్లు సాధించింది. ఇలా అన్నీ ఏరియాలను కలుపుకొని ప్రీసేల్ ద్వారా రూ.16 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇక ఓవర్సీస్ లో డే1 రూ.9.50 కోట్లు, 2వ రోజు రూ.2.60 కోట్లు, 3వ రోజు రూ.5.10 కోట్లు అందుకుంది.

రెట్రో గత 3 రోజుల కలెక్షన్స్ (Retro Day 4 Collections)
రెట్రో చిత్రానికి రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉండటంతో కలెక్షన్ల విషయంలో సూర్య రేంజ్ కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు ఇలా ఉన్నాయి. మొదటి రోజు ఈ చిత్రానికి రూ.32.25 కోట్ల గ్రాస్ అందింది. 2వ రోజు రూ.8 కోట్ల గ్రాస్, 3వ రోజు రూ.19 కోట్ల వరకు వసూళ్లు చేసింది. ఇలా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.60 కోట్ల గ్రాస్ అందుకుంది. 3వ రోజు వరకు ఇండియా నెట్ రూ.35 కోట్లకు చేరుకుంది. ఇండియా గ్రాస్ 41.35 కోట్లకు చేరుకుంది.

రెట్రో 4వ రోజు కలెక్షన్లు..
ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రాకున్నా.. సూర్యకు ఉన్న క్రేజ్ వల్ల బాక్సాఫీస్ కలెక్షన్లు అదిరిపోతున్నాయి. రెట్రో 4వ రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ఆదివారం ఓవరాల్ గా 44 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. దీంతో ఇండియా నెట్ రూ.8 కోట్లు వసూలైందని సాక్ నిల్క్ గణాంకాలు తెలుపుతున్నాయి. తమిళంలో రూ.7.81 కోట్ల నెట్, తెలుగులో రూ.67 లక్షలు, హిందీలో రూ.5 లక్షలు వసూళ్లయ్యాయి. ఇప్పటి వరకు ఇండియా నెట్ రూ.43.48 కోట్లకు చేరుకుంది. ఇండియా గ్రాస్ రూ.60 కోట్లకు చేరుకుందని, వరల్డ్ వైడ్ గా రూ.80 కోట్లకు చేరుకుందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోవాలంటే ఇంకా రూ.85 కోట్లకు పైగానే గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: suriya Retro box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X