Retro Day 6 Collections : రెట్రో 6 రోజుల కలెక్షన్లు.. ఇలాగైతే కోట్లట్లో నష్టం.. ఇంకెంత వసూల్ చేయాలంటే?

రెట్రో వసూళ్లు అంతంత మాత్రమే కనిపిస్తున్నాయి. స్టార్ హీరో సూర్య క్రేజ్ తోనే మొదటి వారం బాక్సాఫీస్ వసూళ్లు జరుగుతున్నాయి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య, పూజా హెగ్దే జంటగా నటించారు. శ్రియా శరణ్ స్పెషల్ సాంగ్ చేసింది. స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక, కార్తీకేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ లు సంయుక్తంగా నిర్మించారు. మే1న తమిళంతో పాటు తెలుగు, హిందీ లోనూ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఆడియెన్స్ నుంచి ఈ చిత్రం పెద్దగా హిట్ టాక్ ను అందుకోకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా రెట్రో బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 6 రోజుల్లో ఎంత వసూల్ చేసింది? ఇంకెంత వసూల్ చేయాలి? ఎంత నష్టం చవిచూసే ప్రమాదం ఉందనే వివరాల్లోకి వెళితే..

రెట్రో బడ్జెట్ (Retro Budget) ఎంత?
రెట్రో చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. సూర్య, పూజా హెగ్దే, శ్రియా శరణ్ తోపాటు ప్రముఖ నటీనటులు నటించారు. ప్రముఖ టెక్నీషియన్లు వర్క్ చేశారు. దీంతో భారీ రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చులు, ప్రమోషన్ ఖర్చులు కలుపుకొని రూ.65 కోట్ల బడ్జెట్‌ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

Retro Day 6Collections Worldwide

రెట్రో బ్రేక్ ఈవెన్ టార్గెట్ (Retro Break Even Target) ఎంత?
థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రెట్రో చిత్రానికి భారీగానే వసూల్ జరిగింది. తమిళనాడు రైట్స్ రూ.40 కోట్లు, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.13 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 18 కోట్లు, తెలుగులో రూ.9.50 కోట్లు అందుకుంది. ఇలా వరల్డ్ వైడ్ గా రూ. రూ.80.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం లాభాల బాట పట్టాలంటే రూ.82 కోట్ల షేర్.. రూ.165 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.

రెట్రో ఓవర్సీస్ (Retro Overseas Collections)
ఈ చిత్రానికి ఓవర్సీస్ లో మాత్రం మంచి రెస్పాన్స్ దక్కుతోంది. రిలీజ్ కు ముందు రోజే కేవలం 24 గంటల్లో తమిళంలో 2 లక్షల టికెట్లు అమ్ముడు పోవడం విశేషం. ఓవర్సీస్ లో తొలిరోజు యూకే అడ్వాన్డ్ బుకింగ్స్ ద్వారా 3200 టికెట్లు అమ్ముడయ్యాయి. 34,246 డాలర్ల వసూళ్లు వచ్చాయి. దీంతో రిలీజ్ కు ముందే రూ.16 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్లు చేసింది. ఇక ఓవర్సీస్ లో మొదటి రోజు రూ.9.50 కోట్లు, 2వ రోజు రూ.2.60 కోట్లు, 3వ రోజు రూ.5.10 కోట్లు, 4వ రోజు రూ.4.6 కోట్లు, 5వ రోజు రూ.1 కోటీ వరకు వసూళ్లు అందుకుందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది.

రెట్రో 6 రోజల వసూళ్లు (Retro Day 6 Collections)
సూర్యకు ఉన్న క్రేజ్ తో మాత్రమే వసూళ్లు అందుతున్నాయని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. దీంతో మొదటి రోజు ఈ చిత్రానికి రూ.32.25 కోట్ల గ్రాస్ అందింది. 2వ రోజు రూ.8 కోట్ల గ్రాస్, 3వ రోజు రూ.19 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది. 4వ రోజు రూ.8.85 కోట్లు గ్రాస్ వసూలైంది. 5వ రోజు రూ.5 కోట్లు ఇండియా గ్రాస్ వసూల్ చేసింది. ఇలా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.78 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక 6వ రోజు ఈ చిత్రం తమిళంలో రూ.2.02 కోట్ల నెట్, తెలుగులో రూ.33 లక్షలు, హిందీలో రూ.5 లక్షల నెట్ వసూల్ చేసింది. ఇలా ఇండియాలో కేవలం 6వ రోజు 2.40 కోట్ల నెట్ అందుకుంది. దీంతో 6వ రోజు వరకు ఇండియా నెట్ రూ.48.9 కోట్లకు చేరుకుందని సాక్ నిల్క్ గణంకాలు తెలుపుతున్నాయి.

బ్రేక్ ఈవెన్ దాటి, లాభాల్లోకి రావలంటే ఇంకెంత వసూల్ చేయాలి?
వీకెండ్స్ లో రెట్రో చిత్రానికి కాస్తా వసూళ్లు అందుతున్నాయి. కానీ వర్కింగ్ డేస్ సోమవారం నుంచి గురువారం వరకు భారీగా డ్రాప్ అవుతున్నాయి. 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఇండియా + ఓవర్సీస్ కలెన్లు కలుపుకొని కేవలం రూ.80 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిల్క్ అంచనా రిపోర్ట్ ఇచ్చింది. కానీ మేకర్స్ 104 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని అధికారికంగా ప్రకటించడం గమనార్హం. ఏదేమైనా ఇంకా ఈ చిత్రం రూ.85 కోట్లు వసూళ్లు చేస్తే గానీ లాభాల్లోకి వచ్చే అవకాశం లేదు. పైగా ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ తోపాటు వసూళ్లు కూడా అంతంత మాత్రానే కనిపిస్తున్నాయి. మొదటి వారమే స్టార్ హీరోల చిత్రాలు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేస్తాయి. కానీ సూర్య రెట్రో మాత్రం ఇంకా సగమే పూర్తి చేసింది. రెండో వారంలో కూడా వసూళ్లు ఇలానే ఉంటే కోట్లట్లో నష్టం చూడటం ఖాయమని అంటున్నారు ట్రెడ్ పండింతులు. మరీ సూర్య ఎలాంటి మేజిక్ చూస్తారో చూడాలి.

More from Filmibeat

Read more about: suriya Retro box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X