Retro Day 7 Collections : రెట్రో 7వ రోజు కలెక్షన్లు.. బ్రేక్ ఈవెన్ కు ఎంత దూరం? ఎన్ని కోట్లు రాబట్టాలి?

సూర్య రెట్రో వసూళ్లు ఓ మాదిరిగా ఉన్నాయి. 1వ వారం పూర్తైనా ఈ చిత్రం రూ.100 కోట్లకు చేరుకోలేకపోయింది. సోమవారం నుంచి వసూళ్లు డ్రాప్ అవుతూ వస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. సూర్య, పూజా హెగ్దే జంటగా నటించారు. శ్రియా శరణ్ స్పెషల్ సాంగ్ చేసింది. స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక, కార్తీకేయన్ సంతానం, రాజశేఖర్ నిర్మించారు. మే1న తమిళం, తెలుగు, హిందీ లో రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో రెట్రో బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 7 రోజుల్లో ఎంత వసూల్ చేసింది? ఇంకెంత వసూల్ చేయాల్సి ఉందనే వివరాల్లోకి వెళితే..

రెట్రో బడ్జెట్ (Retro Budget) ఎంత?
సూర్య, పూజా హెగ్దే, శ్రియా శరన్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటీనటులు, టెక్నీషియన్లు కూడా వర్క్ చేశారు. దీంతో భారీ రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ ఖర్చులు కలుపుకొని రూ.65 కోట్ల బడ్జెట్‌ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

Retro Day 7Collections Worldwide

రెట్రో బ్రేక్ ఈవెన్ టార్గెట్ (Retro Break Even Target) ఎంత?
రెట్రో చిత్రానికి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా భారీగానే వసూలైంది. తమిళనాడు రైట్స్ రూ.40 కోట్లు, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.13 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 18 కోట్లు, తెలుగులో రూ.9.50 కోట్లు అందుకుంది. వరల్డ్ వైడ్ గా రూ.80.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ పూర్తి కావాలంటే రూ.82 కోట్ల షేర్.. రూ.165 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు వాల్యూ కట్టారు.

రెట్రో ఓవర్సీస్ (Retro Overseas Collections)
విడుదలకు ముందు 24 గంటల్లో ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో ప్రీ సేల్స్ అందుకుంది. యూకే అడ్వాన్డ్ బుకింగ్స్ ద్వారా 3200 టికెట్లు అమ్ముడయ్యాయి. 34,246 డాలర్లు అందాయి. దీంతో రూ.16 కోట్ల గ్రాస్ ను ఓవర్సీస్ లో ప్రీ సేల్ వసూళ్లుగా అందుకుంది. ఇక ఓవర్సీస్ లో మొదటి రోజు రూ.9.50 కోట్లు, 2వ రోజు రూ.2.60 కోట్లు, 3వ రోజు రూ.5.10 కోట్లు, 4వ రోజు రూ.4.6 కోట్లు, 5వ రోజు రూ. 50 లక్షలు, 6వ రోజు రూ.50 లక్షలు అందుకుంటున్నట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇప్పటి వరకు రూ.23.15 కోట్ల గ్రాస్ ను ఓవర్సీస్ లో వసూల్ చేసింది.

రెట్రో 7 రోజల వసూళ్లు (Retro Day 7 Collections)
ఈ చిత్రానికి మొదటి రోజు రూ.32.25 కోట్ల గ్రాస్ అందింది. 2వ రోజు రూ.8 కోట్లు, 3వ రోజు రూ.19 కోట్లు, 4వ రోజు రూ.8.85 కోట్లు గ్రాస్ వసూలైంది. 5వ రోజు రూ.5 కోట్లు, 6వ రోజు రూ.5 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది. ఇక 7వ రోజు ఇండియా నెట్ రూ.1.75 కోట్లు మాత్రమే వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. రూ.3.5 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక తమిళంలో రూ.1.63 కోట్ల నెట్, తెలుగులో రూ.27 లక్షలు, హిందీలో రూ.3 లక్షలు అందుకుంది. దీంతో ఇండియా నెట్ మొత్తం రూ.50.95 కోట్లకు చేరుకుందని సాక్ నిల్క్ గణాంకాలు తెలుపుతున్నాయి. మరోవైపు ఈ చిత్రం ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్నా కూడా రూ.100 కోట్ల క్లబ్ లో చేరలేకపోయింది. 7 రోజుల వరకు ఇండియా + ఓవర్సీస్ బాక్సాఫీస్ కలెక్షన్లు కలుపుకొని మొత్తంగా రూ.90 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. కానీ మేకర్స్ 104 కోట్ల వరకు గ్రాస్ వసూలైనట్టు ప్రకటించడం గమనార్హం. ఏదేమైనా ఇంకా ఈ చిత్రం రూ.75 కోట్ల వరకు వసూళ్లు రాబడితేనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కానుంది. కానీ ఇప్పుడు అందుతున్న వసూళ్లు చూస్తే ఈ సినిమా నష్టాలనే మిగిల్చేలా ఉందని అంటున్నారు. మరి మున్ముందు ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

Take a Poll

More from Filmibeat

Read more about: suriya Retro box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X