Retro Day 2 Collections: షాకింగ్‌గా రెట్రో కలెక్షన్లు.. డిజాస్టర్ టాక్‌లో సూర్య మూవీ దిమ్మతిరిగే వసూళ్లు!
తమిళ సూపర్ స్టార్ సూర్య, పూజా హెగ్డే జంటగా రూపొందిన రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా రెట్రో (Retro Review). కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై కార్తీకేయన్ సంతానం, సూర్య, జ్యోతిక నిర్మాతలుగా మారి నిర్మించారు. తమిళంలో పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జయరాం, జోజు జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు, కలెక్షన్లు ఏ మేరకు సాధించిందనే వివరాల్లోకి వెళితే.
రొమాంటిక్ అండ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమాను అండమాన్, ఇతర ప్రాంతాల్లో చిత్రీకిరించారు. అలాగే ఈ సినిమాకు టాప్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ వర్క్ చేయడం వల్ల బడ్జెట్ భారీగానే అయింది. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 70 కోట్ల రూపాయలతో పూర్తి చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమాను సొంతంగా సూర్య దంపతులు రిలీజ్ చేశారు.

రెట్రో సినిమాకు రిలీజ్ తర్వాత తొలుత మిక్స్‌డ్ టాక్.. ఆ తర్వాత డిజాస్టర్ టాక్ వచ్చింది. అయినప్పటికీ సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ పైన ఉండే క్రేజ్ కారణంగా భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. అయితే ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే బెస్ట్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా వసూళ్లు ట్రేడ్ వర్గాల అంచనాలను కూడా దాటేశాయి. అయితే రానున్న రోజుల్లో ఈ సినిమా నిలకడగా వసూళ్లను సాధిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.
ఇక రెట్రో సినిమా తమిళనాడులో 19 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. కేరళలో కూడా ఈ సినిమా రికార్డు లెవెల్‌లో 2.5 కోట్లు, ఆంధ్రా, నైజాంలో 2.5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 3 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 27 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
ఇక రెట్రో సినిమాకు ఓవర్సీస్‌లో భారీగా స్పందన కనిపించలేదు. గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాకు రెస్పాన్స్ అతంత మాత్రంగానే ఉంది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 9 కోట్ల రూపాయల మేర కలెక్షన్లు సాధించింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 36 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఇటీవల కాలంలో తమిళ సినిమాకు అత్యుత్తమ వసూళ్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా, రెట్రో మూవీ రెండో రోజు నిలకడగా వసూళ్లును రాబట్టే అవకాశాలు స్పష్టంగా కనిపించాయి. ఈ సినిమాకు ఓవరాల్‌గా 45 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో ఈ సినిమా రెండో రోజున ఇండియాలో 8 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 12 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా రెండో రోజు 50 కోట్ల వసూళ్లకు చేరువ కానున్నది.


Click it and Unblock the Notifications











