Retro Day 3 Collections: 100 కోట్లపై కన్నేసిన రెట్రో.. సూర్య నష్టాల నుంచి బయట పడాలంటే?
తమిళ సూపర్ స్టార్ సూర్య, పూజా హెగ్డే జంటగా రూపొందిన రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా రెట్రో (Retro Review). కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై కార్తీకేయన్ సంతానం, సూర్య, జ్యోతిక నిర్మాతలుగా మారి నిర్మించారు. తమిళంలో పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జయరాం, జోజు జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు, కలెక్షన్లు ఏ మేరకు సాధించిందనే వివరాల్లోకి వెళితే.
160 కోట్ల బడ్జెట్‌తో
ఫాదర్ సెంటిమెంట్, రొమాంటిక్ అండ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమాను అండమాన్, ఇతర ప్రాంతాల్లోని అందమైన ప్రదేశాల్లో భారీగా చిత్రీకిరించారు. అలాగే ఈ సినిమాకు టాప్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ వర్క్ చేయడం వల్ల బడ్జెట్ భారీగానే అయింది. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 70 కోట్ల రూపాయలతో పూర్తి చేయగా, సూర్య, పూజా హెగ్డే రెమ్యునరేషన్ కలిపి ఈ సినిమాను బడ్జెట్‌ను 160 కోట్లుగా వాల్యూ చేశారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
రెట్రో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను 40 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. ఈ సినిమాను సూర్య, జ్యోతిక సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆంధ్రా, నైజాం మూవీ రైట్స్ 10 కోట్లు, కేరళ, ఇతర రాష్ట్రాల హక్కులు 5 కోట్లు, కర్ణాటక 8 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 18 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 80 కోట్లుగా వాల్యూ కట్టారు.
2 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రెట్రో సినిమా గత రెండు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ తమిళనాడులో 24 కోట్ల రూపాయల గ్రాస్, ఆంధ్రా, నైజాంలో 4 కోట్ల రూపాయల గ్రాస్, కర్ణాటకలో 4 కోట్ల రూపాయల గ్రాస్, కేరళలో 3 కోట్ల గ్రాస్, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 14 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా మొత్తంగా 49 కోట్ల రూపాయల గ్రాస్, 26 కోట్ల షేర్ వసూళ్లను రెండు రోజుల్లో వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
3వ రోజు ఆక్యుపెన్సీ
ఇక రెట్రో మూవీ 3వ రోజు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. మార్నింగ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 45 శాతం, ఫస్ట్ షోకు 45 శాతం, సెకండ్ షోకు 45 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది. చెన్నై, మధురై, కోయంబత్తూరు, పాండిచ్చేరి, వెల్లూరు, దిండిగల్, త్రిచీ తదితర ప్రాంతాల్లో 35 శాతం నుంచి 60 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదైంది.
3వ రోజు కలెక్షన్లు
ఇదిలా ఉండగా, రెట్రో సినిమా మూడో రోజు కూడా నిలకడగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబడుతున్నదని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా మూడో రోజు 7 నుంచి 8 కోట్ల ఇండియాలో, వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 15 కోట్ల మేర వసూళ్లను రాబడుతుందని అంచనా వేశారు. దాంతో ఈ సినిమా 64 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 80 కోట్ల షేర్, 160 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











