Retro Business: రెట్రో మూవీకి రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్.. సూర్య సినిమాకు ఎన్ని కోట్లంటే?
తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై కార్తీకేయన్ సంతానం, సూర్య, జ్యోతిక నిర్మాతలుగా మారి నిర్మించిన చిత్రం రెట్రో (Retro). పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సూర్య, పూజా హెగ్డే, జయరాం, జోజు జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. మే 1వ తేదీన ప్రపంచవ్యాపత్ంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..
సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం రొమాంటిక్, గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీగా రూపొందింది. ఈ సినిమాకు టాప్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ వర్క్ చేయడం వల్ల బడ్జెట్ భారీగానే అయింది. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 70 కోట్ల రూపాయలతో పూర్తి చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ఆడియో వేడుక తర్వాత బజ్ భారీగా పెరిగిపోయింది.

రెట్రో మూవీ ప్రమోషనల్ కంటెంట్, టీజర్, ట్రైలర్ తదితర అంశాలకు మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ వర్గాల ఆసక్తి పెరిగిపోయింది. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం భారీగా పోటీ జరిగింది. అయితే ఈ సినిమాను సొంతం చేసుకోవడానికి పలు సంస్థలు ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేశాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ట్రేడ్ భారీగా జరిగింది అని తమిళ సినీ వర్గాలు వెల్లడించాయి.
రెట్రో మూవీ డిజిటిల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకొన్నది. ఈ సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించి హక్కులను సాధించుకొన్నది. ఇక ఈ మూవీ శాటిలైట్ రైట్స్‌ను సన్ టెలివిజన్ సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమా బడ్జెట్‌లో సగానికిపైగా డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్మకాలతో ఆదాయం సమకూరింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ తమిళ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ టౌన్‌గా మారింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రెట్రో సినిమాను సూర్య, జ్యోతిక దంపతులు తమిళంలో నేరుగా రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదని పేర్కొంటున్నారు. అయితే ఈ సినిమాను తమిళ థియేట్రికల్ రైట్స్‌ను 50 కోట్ల షేర్, 100 కోట్ల గ్రాస్‌గా వాల్యూ కట్టారు. ఇక తెలుగులో ఈ సినిమాను నిర్మాత నాగవంశీ తన సొంత బ్యానర్ సితార డిస్ట్రిబ్యూషన్ ద్వారా కలెక్షన్లపై కమిషన్ బేస్ మీద రిలీజ్ చేస్తున్నారు అని ట్రేడ్ రిపోర్ట్.
ఇదిలా ఉండగా, తమిళనాడులో రెట్రో మూవీ అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. ఇటీవల ఓపెన్ అయిన అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటికే 5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్‌లో మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత కొద్దికాలంగా భారీ విజయం కోసం ఎదురు చూస్తున్న సూర్యకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











