Revolver Rita Day 2 Collections: దారుణంగా రివాల్వర్ రీటా కలెక్షన్స్.. భారీ నష్టాల దిశగా కీర్తి సురేష్ మూవీ

కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో నటించిన మూవీ రివాల్వర్ రీటా. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమాను పాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్‌పై సాధన్ సుందరం, జగదీష్ పళనిస్వామిలు నిర్మించారు. రాధిక శరత్ కుమార్, సునీల్, రెడిన్ కింగ్ల్సే, సెండ్రాయన్, సూపర్ సుబ్బరాయన్, జాన్ విజయ్, కళ్యాణ్ మాస్టర్, సురేష్ చక్రవర్తి, ఆగస్టిన్, బ్లేడ్ శంకర్, రామచంద్రన్‌ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు.

దినేష్ బీ కృష్ణన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సీయాన్ రోల్డన్‌ సంగీత దర్శకత్వం వహించారు. నవంబర్ 28న రివాల్వర్ రీటా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండు రోజుల్లో ఈ రివాల్వర్ రీటా చిత్రం ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూస్తే?

Revolver Rita Day 2 Box Office Collections Worldwide Keerthy Suresh s Movie Heading towards Disaster

రివాల్వర్ రీటా బడ్జెట్
నటీనటులు, సాంకేతి నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి రివాల్వర్ రీటా సినిమాకు 25 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. చెన్నైతో పాటు దక్షిణ భారతదేశంలోని అందమైన లోకేషన్స్‌‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు, కీర్తి సురేష్ స్టార్‌డమ్ కారణంగా రివాల్వర్ రీటా సినిమాకు బాగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కీర్తి సురేష్ సినిమాకు వరల్డ్ వైడ్‌గా 12 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. దాంతో రివాల్వర్ రీటా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రావాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. కీర్తి సురేష్ సినిమాను భారతదేశంలో 400 స్క్రీన్స్‌లో, విదేశాల్లో 200 స్క్రీన్స్‌లో విడుదల చేశారు.

రివాల్వర్ రీటా కలెక్షన్స్
భారీ అంచనాల మధ్య విడుదలైన రివాల్వర్ రీటా సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. మిక్స్‌డ్ ‌టాక్‌కు తోడు చిన్నా, పెద్దా సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో ఈ సినిమాకు ఆదరణ దక్కడం లేదు. తొలి రోజు కీర్తి సురేష్ సినిమా ఇండియాలో 75 లక్షల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టగా.. రెండో రోజు మరో 75 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో రెండ్రోజుల్లో రివాల్వర్ రీటా చిత్రం ఇండియాలో 1.5 కోట్ల రూపాయల నెట్.. 1.8 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

తమిళంలో తొలి రోజున 55 లక్షల రూపాయలు, రెండో రోజున 50 లక్షల చొప్పున 1.05 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగులో తొలి రోజున 20 లక్షల రూపాయలు, రెండో రోజున 25 లక్షల రూపాయలు చొప్పున 45 లక్షల రూపాయలు రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఈ వసూళ్లతో కీర్తి సురేష్ చిత్రం భారీ నష్టాల దిశగా సాగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి థియేట్రికల్ రన్ ముగిసేసరికి రివాల్వర్ రీటా మూవీ ఎంత రాబడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X