వర్మ ‘సత్య2’ బిజినెస్ పరిస్ధితి?
రామ్ గోపాల్ వర్మ సినిమాలు వరసగా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కావటంతో ఈ చిత్రం బిజినెస్ పై ఆ ఇంపాక్ట్ పడిందని సమాచారం. దాంతో వర్మ ఎలాగైనా ఈ సినిమాని ఒడ్డున పడేయాలని సతమతమవుతున్నట్లు ముంబై వర్గాల సమాచారం. మరో ప్రక్క శర్వానంద్ కూడా క్లాస్ హీరో కావటంతో బిజినెస్ పరంగా పెద్ద హెల్ప్ కావటంలేదు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ అందరికీ బిజినెస్ మ్యాన్ చిత్రం గుర్తుకు తేవటం కూడా మైనస్ గా మారింది. అయితే చిత్రం పై వర్మ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
వర్మ మాట్లాడుతూ...1998లో వచ్చిన 'సత్య' అప్పటి పరిస్థితుల ఆధారంగా రూపొందించాం. అప్పటికి ఇప్పటికీ సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఇప్పటి పరిస్థితుల ఆధారంగా ఈచిత్రం తెరకెక్కించాం. క్రైమ్ చేసే వ్యక్తి సైకాలజీ స్టడీ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ధీరూబాయ్ అంబానీ లాంటి వ్యక్తి కార్పొరేట్ సంస్థల వైపు కాకుండా, అండర్ వరల్డ్ వైపు వెళ్లి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం' అన్నారు.
శర్వానంద్ మాట్లాడుతూ....రామ్ గోపాల్ వర్మ లాంటి బ్రిలియంట్ డైరెక్టర్ తో కలిసి పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి ఆ కల తీరింది. ఈ సినిమాలో కొత్తరకం క్రైమ్ కోణం ప్రేక్షకులు చూస్తారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు.
ఈ చిత్రాన్ని సుమంత్ మెట్టు, చంద్రశేఖర్ ...ముమ్మత్ మీడియా అండ్ ఎంటర్టెన్మెంట్ ప్రై.లి, జెడ్ 3 పిక్చర్స్ బేనర్‌లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : అమర్ మోహిలె, సినిమాటోగ్రఫీ : వికాస్ సారాఫ్, దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ.


Click it and Unblock the Notifications












