RGV కొంపముంచిన పవర్ స్టార్ లీక్.. ఆ ఒక్క యాప్‌తో గాలిలో కలిసిపోతున్న కలెక్షన్స్!
పవర్ స్టార్ సినిమా కోసం RGV పడిన కష్టం అంతా ఇంతా కాదు. ప్రమోషన్స్ డోస్ పెంచడానికి అన్ని దారులను వాడుకున్నాడు. దీంతో సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఆ కష్టమంతా ఇప్పుడు పైరసీ వల్ల వృధా అవుతోంది. వర్మకు లాభాలు వచ్చే సమయంలో సినిమా లీక్ అవ్వడం వల్ల చాలా ఎఫెక్ట్ చూపుతోంది.

గట్టిగానే ఉపయోగించుకున్నాడు
గతంలో ఎప్పుడు లేని విధంగా పవర్ స్టార్ సినిమాను రూపొందించిన రామ్ గోపాల్ వర్మ ప్రమోషన్స్ కోసం అభిమానుల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. చివరికి ఆఫీసుపై దాడిని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే దాన్ని కూడా వర్మ ప్రమోషన్స్ కి గట్టిగానే ఉపయోగించుకున్నాడు.

ఆ యాప్ లో ఈజీగా డౌన్ లోడ్
విడుదలైన కొన్ని గంటల్లోనే పవర్ స్టార్ HD ప్రింట్ ఆన్లైన్ లోనే లీక్ అయ్యింది. మొదట ఎప్పటిలానే తమిళ్ రాకర్స్ ద్వారా లీక్ అయ్యింది. అయితే అందులో కంటే ఎక్కువగా టెలిగ్రామ్ యాప్ లో కూడా జోరుగా ఈ సినిమా జనాల వద్దకు ఫ్రీగా చేరుకుంటోంది. ఇటీవల కాలంలో టెలిగ్రామ్ యాప్ లో సినిమాలను డౌన్ లోడ్ చెసుకోవడం చాలా ఈజీగా మారింది.

దానికంటే అదే బెస్ట్
ఒక విధంగా తమిళ్ రాకర్స్ ఆన్లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవడం అంటే టెక్నాలజీ మీద కాస్త పట్టు ఉన్న వారికే సాధ్యం అవుతోంది. ఆ లింక్స్ తో సిస్టమ్ వైరస్ భారిన పడే అవకాశం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే చాలా వరకు తమిళ్ రాకర్స్ కంటే కూడా టెలిగ్రామ్ యాప్ నుంచే డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.

జోరుగా షేరింగ్..
మొదట తమిళ్ రాకర్స్ నుంచే లీక్ అయినప్పటికీ RGV పవర్ స్టార్ టెలిగ్రామ్ యాప్ లో జోరుగా షేర్ చేసుకుంటున్నారు. ఒక్క క్లిక్ తో డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్ ఉండడంతో సినిమాల కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడుతోంది. గత సినిమాలతో లక్షల డబ్బును వెనకేసుకున్న వర్మ ఈ సారి మాత్రం అనుకున్నంతగా లాభాలను అందుకోవడం లేదని తెలుస్తోంది.
Recommended Video

కలెక్షన్స్ గాలిలో కలిసిపోతున్నాయి
సినిమాకు బజ్ అయితే బాగానే వచ్చింది. RGV యాక్టింగ్ కి చాలా మంది ఫిదా అవుతున్నారు. అయితే RGV వరల్డ్ లోకి వెళ్లి 250రూపాయలు డబ్బులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు చాలా మంది. టెలిగ్రామ్ లో ఈజీగా అందుబాటులోకి వస్తోందని సెర్చ్ చేసి డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. దీంతో వర్మకు రావాల్సిన లాభాలు గాలిలో కలిసిపోతున్నాయి. మరి భవిష్యత్తులో అయినా వర్మ ఇలా లీక్ అవ్వకుండా ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











