For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘డిపార్ట్ మెంట్’ కలెక్షన్ల పరిస్థితి ఏమిటి?

  By Bojja Kumar
  |

  రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'డిపార్ట్ మెంట్' చిత్రం తొలి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో కలెక్షన్ల పరిస్థితి కూడా చాలా డల్ అయిపోయింది. సినిమా చెత్తగా ఉందని రివ్యూలు కూడా రావడంతో వర్మ ఖాతాలో మరో పెద్ద ప్లాప్ వచ్చి పడినట్లయింది.

  అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రాణా దగ్గుబాటి, మధుశాలిని, మంచు లక్ష్మి తదితరులు నటించిన ఈచిత్రం శుక్రవారం దేశ వ్యాప్తంగా విడుదలైంది. అయితే సినిమా ప్రేక్షకులు ఎలాంటి ఆసక్తి చూపక పోవడానికి తోడు....సినిమా బాగోలేదనే టాక్ రావడంతో తొలి రోజు ఈచిత్రం పేలవంగా కేవలం రెండున్నర కోట్లు మాత్రమే రాబట్టిందని తెలుస్తోంది.

  పరిస్థితి చూస్తుంటే సినిమాకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం కష్టమే అని, నిర్మాత నిండా మునగక తప్పదని ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. మరో వైపు ఈచిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మధుశాలిని, మంచు లక్ష్మిలు కూడా చాలా డిసప్సాయింట్‌గా ఉన్నారు. సినిమా పరమ ప్లాపు కావడంతో ఇక తమకు బాలీవుడ్‌లో భవిష్యత్ ఉంటుందో? లేదో? అనే బెంగపెట్టుకున్నారట. 'దమ్ మారో దమ్' చిత్రం ద్వారానే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాణాకు....ఆ చిత్రం అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'డిపార్ట్ మెంట్' చిత్రం కూడా రాణాను నిరాశ పరిచింది.

  మెగా టార్చర్ గా ప్రేక్షకులు అభివర్ణిస్తున్న ఈ చిత్రాన్ని వర్మ చాలా కాలం క్రితమే ఫూర్తి చేసి క్రేజ్ రాకపోవటంతో ఐటం సాంగ్ కలిపి, క్లైమాక్స్ రీ షూట్ చేసి వదిలాడు. అయినా వర్మ రెగ్యులర్ ప్లాప్ కంటే మరికాస్త అద్వానంగా ఉండటం తప్ప ఈ చిత్రంలో చెప్పుకోతగ్గ మార్పేమి లేదని చూసిన వారు పెదవి విరుస్తున్నారు. బి గ్రేడ్ స్క్రిప్టులో ఎ గ్రేడ్ ఆర్టిస్టులు నటించిన ఈ చిత్రం సి గ్రేడ్ ప్రేక్షకులుకు కూడా నచ్చదు.

  పోలీసు డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో సాగుతుంది. ముంబయిలో మాఫియాని అదుపులో పెట్టడానికి పోలీసు డిపార్ట్‌మెంట్‌ ప్రత్యేకంగా ఓ బృందాన్ని సిద్ధం చేస్తుంది. చట్టం, న్యాయం ఇవేవీ ఆ బృందానికి వర్తించవు. అందులో పని చేసే శివనారాయణ్‌(రాణా)అనే ఓ పోలీసు అధికారి పాత్ర నిజాయతీపరుడు. డిపార్టమెంట్ కి బాస్ అయిన మాధవ్ బోంస్లే(సంజయ్ దత్)తో కలిసి అండర్ వలర్డ్ గూండాలను ఏరిపారేస్తూంటాడు. ఆ క్రమంలో అతని చుట్టూ చోటు చేసుకొనే సంఘటనల సమాహారమే ఈ చిత్రం.

  English summary
  Ram Gopal Varma's latest Hindi movie Department, which features Amitabh Bachchan, Sanjay Dutt and Rana Daggubati in the leads, has opened to a very poor response at the Box Office on the first day of its release. The film needs to have a big jump if its has to get back its production cost. Department has received a dismal response from the viewers across the country in the matinee and afternoon shows. The movie has registered 10% to 15% occupancy at both multiplexes as well as single screens. As per the early trends, the film is expected to earn Rs 2.5 to 3 crores at the Box Office.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X