For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదిరింది: ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’కాన్సెప్ట్ పోస్టర్

    By Srikanya
    |

    హైదరాబాద్: గందపుచెక్కల దొంగ వీరప్పన్‌ జీవిత కథ ఆధారంగా వర్మ సినిమా చేసి వచ్చే నెల అంటే జనవరి మొదటి తేదీన విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అండర్‌ వరల్డ్‌ డాన్‌, మాఫియా డాన్‌ల కంటే కూడా వీరప్పన్‌ ఎంతో శక్తివంతుడు అని, ఆయన తిరుగులేని క్రిమినల్‌ అంటూ వీరప్పన్‌ గురించి వర్మ చెబుతుూ మరీ తెరకెక్కించారు.

    కన్నడ,హిందీ, తెలుగులో విడుదల అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా కొత్త పోస్టర్ విడుదల చేసారు. కాన్సెప్ట్ ని చెప్పే ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో అందరి మన్ననలూ పొందుతోంది. మీరూ ఈ పోస్టర్ ని చూడండి.

    ఇక ఆ మధ్యన చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూసిన వారు..వర్మ ఈజ్ బ్యాక్ అంటున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    కన్నడ హీరో శివరాజ్ కుమార్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. పరుల్ యాదవ్, యజ్ఞ శెట్టి హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్ర పోషిస్తున్నాడు. గతంలో రాజ్‌ కుమార్‌ను వీరప్పన్‌ కిడ్నాప్‌ చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో శివరాజ్‌ కుమార్‌ను ఈ సినిమాకు హీరోగా ఎంపిక చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది.

    RGV's Killing Veerappan new poster

    రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కొన్నేళ్ళ పాటు వణికించిన డేంజరస్ క్రిమినల్ వీరప్పన్‌ను చంపిన ఓ పోలీసాఫీసర్ కథగా ‘కిల్లింగ్ వీరప్పన్' రూపొందుతోంది. కర్ణాటక, తమిళనాడు, మారెడుమిల్లి ఫారెస్ట్ ఏరియాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది.

    వర్మ మాట్లాడుతూ... వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత అతడు ఎంత డేంజరస్ వ్యక్తి అనే విషయం అర్థమైందని, అలాంటి క్రిమినల్‌ను చంపిన ఓ పోలీసాఫీసర్ కథే ఈ ‘కిల్లింగ్ వీరప్పన్' అని వర్మ తెలిపారు.

    వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత మాఫియా గ్యాంగ్‌స్టర్ మర్డర్స్ లాంటివి చిన్న పిల్లల ఆటలా కనిపించాయని వర్మ తెలిపాడు. ఒసామా బిన్ లాడెన్ కన్నా శక్తిమంతుడైన వీరప్పన్ ఎంతో మంది పోలీసులను, అడవి జంతువులను చంపి తిరుగులేని క్రిమినల్‌గా అవతరించాడని వర్మ చెప్పుకొచ్చాడు. అలాంటి క్రిమినల్‌ను చంపిన పోలీస్ కథే ‘కిల్లింగ్ వీరప్పన్'గా వర్మ తెలిపాడు.

    ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వీరప్పన్‌ను చంపే ఆఫీసర్‌గా నటించటంతో క్రేజ్ క్రియేట్ అయ్యింది. సినిమా అద్భుతంగా రూపొందనుందని ఒక ఇంటెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని వర్మ ఈ సందర్భంగా తెలిపాడు.

    ఈ చిత్రానికి తెలుగులోనూ మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఇది నిజ జీవితానికి చెందిన రియల్ లైఫ్ స్టోరీ అని చెప్తున్నారు వర్మ. వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత మాఫియా గ్యాంగ్‌స్టర్ మర్డర్స్ లాంటివి చిన్న పిల్లల ఆటలా కనిపించాయని వర్మ తెలిపాడు.

    English summary
    RGV Shared in FB: A great conceptual design of bnaveenkalyan1 for "Killing Veerappan" . Killing Veerappan is an upcoming film directed by Ram Gopal Varma with Shivaraj Kumar, Sandeep Bharadwaj and Parul Yadav in lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X