Kantara Telugu Collections: కేజీఎఫ్ రికార్డు బ్రేక్ చేసిన కాంతార.. తెలుగులో మరో సంచలనం
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో అన్ని ఇండస్ట్రీల నుంచి మంచి కాన్సెప్టులతో సినిమాలు వస్తున్నాయి. వాటికి ప్రేక్షకుల నుంచి కూడా విశేషమైన స్పందన దక్కుతోంది. ఫలితంగా అలాంటి చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. అదే సమయంలో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. అందులో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన 'కాంతార' ఒకటి. శాండిల్‌వుడ్‌లో భారీ సక్సెస్‌ను సొంతం చేసుకుని చాలా భాషల్లోకి వచ్చింది. అలా తెలుగులో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో 'కాంతార' 10 రోజుల రిపోర్టును చూడండి!

నేషనల్ రేంజ్‌కెళ్లిన కాంతార
ప్రముఖ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే 'కాంతార'. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం అందించారు. ఇది కన్నడంలో ఎప్పుడో వచ్చినా తెలుగులో అక్టోబర్ 15న రిలీజ్ అయింది.

తెలుగులో బిజినెస్ వివరాలు
కన్నడంలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలై భారీ విజయాన్ని దక్కించుకున్న 'కాంతార'ను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుని.. ఏపీ, తెలంగాణలో ఎంతో గ్రాండ్‌గా విడుదల చేసింది.

10వ రోజు తెలుగు వసూళ్లిలా
'కాంతార' మూవీకి 10వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 60 లక్షలు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 16 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. రూ. 1.30 కోట్లు షేర్, రూ. 2.10 కోట్లు గ్రాస్ వసూలైంది.
కోహ్లీ భార్య అనుష్క హాట్ షో: పండుగ పూట ఎద అందాలు కనిపించేలా!
https://telugu.filmibeat.com/heroine/virat-kohli-wife-anushka-sharma-gorgeous-photos-viral-114123.html

10 రోజుల్లో ఎంత వచ్చింది?
10 రోజుల్లో 'కాంతార'కు కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 6.68 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.92 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.98 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.19 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 77 లక్షలు, గుంటూరులో రూ. 99 లక్షలు, కృష్ణాలో రూ. 99 లక్షలు, నెల్లూరులో రూ. 61 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 15.13 కోట్లు షేర్, రూ. 27.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?
విలక్షణమైన సబ్జెక్టుతో వచ్చిన 'కాంతార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 15.13 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 12.83 కోట్లు లాభాలు లభించాయి.

కేజీఎఫ్ రికార్డు బ్రేక్ చేసింది
'కాంతార' మూవీకి తెలుగులో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. దీంతో ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇక, తాజాగా ఇది తెలుగులో ఎక్కువ వసూళ్లు రాబట్టిన కన్నడ చిత్రాల జాబితాలో రెండో స్థానానికి చేరింది. ఈ క్రమంలోనే కేజీఎఫ్ పార్ట్ 1 (13 కోట్లు)ను దాటేసింది. ఇక, ఓవరాల్‌గా డబ్బింగ్ సినిమాల జాబితాలో పదమూడో స్థానానికి చేరి సత్తా చాటుకుంది.


Click it and Unblock the Notifications











