Kantara Collections: బాక్సాఫీస్ వద్ద మరింత లాభాలు.. ఇప్పటివరకు ఎంత వచ్చాయంటే?
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఇటీవల కాలంలో అయితే డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుతున్నాయి. ఇక కాంతార సినిమా అందుకు మరో ఉదాహరణగా నిలిచింది. కన్నడ చిత్ర పరిశ్రమలో పెద్దగా అంచనా లేకుండా వచ్చిన ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ రావడం విశేషం. ఇక మొత్తంగా 12 రోజులకు ఈ సినిమా తెలుగులో ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

మరోసారి చూడాలి అనేలా..
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడమే కాకుండా సినిమాలో హీరోగా నటించి మంచి గుర్తింపును అందుకున్నాడు. అతని మేకింగ్ విధానం కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సినిమా చివరలో అతను నటించిన విధానం కోసం మరోసారి అయిన సినిమా చూడవచ్చు అని ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు. హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ ఈ సినిమాను నిర్మించగా ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం అందించిన విధానం ఎంతగానో కట్టుకుంది. ఇక అక్టోబర్ 15న ఈ సినిమా తెలుగులో విడుదలయ్యింది.

బిజినెస్ వివరాలు
కన్నడలో ఈ సినిమా ఒక మీడియం రెంజ్ సినిమా తరహాలో పెద్దగా వచనాలు లేకుండా సెప్టెంబర్ 30వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాను నిర్మాతలు 18 కోట్లతో నిర్మించారు. ఇక తెలుగులో నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను విడుదల చేశారు గీతా ఆర్ట్స్ కేవలం ఈ సినిమా రిలీజ్ హక్కులను రెండు కోట్లకు మాత్రమే దక్కించుకుంది. ఇక మొదట కొన్ని లిమిటెడ్ ఏరియాలలో విడుదల చేసి పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ థియేటర్ల సంఖ్యను పెంచారు.

12వ రోజు వచ్చిన కలెక్షన్స్
'కాంతార' సినిమా 12వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సాధించిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 28 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రూ. 0.60 కోట్లు షేర్, రూ. 1.00 కోట్లు గ్రాస్ వసూలైంది.

12 రోజుల టోటల్ కలెక్షన్లు
12 రోజులలో 'కాంతార' సినిమా నిర్మాతలకు మంచి ప్రాఫిట్స్ అయితే అందించింది. ఏరియాల వారిగా చూసుకుంటే నైజాంలో రూ. 7.32 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.06 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.14 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.30 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 1.09 లక్షలు, కృష్ణాలో రూ. 1.09 లక్షలు, నెల్లూరులో రూ. 67 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 16.51 కోట్లు షేర్, రూ. 29.85 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రాఫిట్స్ ఎంతంటే?
'కాంతార' సినిమా దీపావళిని కూడా చాలా బాగా యూజ్ చేసుకుంది. అంచనాలకు అనుగుణంగా రోజురోజుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సినిమా కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి. ఇక తెలుగులో రూ. 2.00 కోట్లు బిజినెస్ చేసిన కాంతార రూ. 2.30 కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఇక 12 రోజుల్లో కాంతార భారీ స్థాయిలో ఏపీ తెలంగాణలో రూ. 16.51 కోట్లు వసూలు చేసింది. ఇక ఫైనల్ సినిమా హిట్ స్టేటస్‌తో రూ. 14.21 కోట్ల ప్రాఫిట్ తో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











