Kantara Telugu Collections: తెలుగులో కాంతార మరో రికార్డు.. ఇంకో 30 లక్షలు వస్తే చరిత్రే!

ఈ మధ్య కాలంలో సరికొత్త కాన్సెప్టులతో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సౌతిండియాలో ప్రయోగాత్మకంగా చాలా సినిమాలు రూపొందుతోన్నాయి. అలా వచ్చిన వాటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో దర్శక నిర్మాతలు, హీరోలు మరింత ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఇలా ఇటీవలే విడుదలైన సినిమానే 'కాంతార'. కన్నడంలో రూపొందిన ఈ మూవీ కొద్ది రోజుల క్రితమే తెలుగులో కూడా విడుదలైంది. దీనికి ఇక్కడ భారీ వసూళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కాంతార' మూవీ 13 రోజుల రిపోర్టు చూద్దాం పదండి!

తెలుగులోకి వచ్చేసిన కాంతార

తెలుగులోకి వచ్చేసిన కాంతార


కన్నడ చిత్ర పరిశ్రమలో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమానే 'కాంతార'. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం అందించారు. ఇది కన్నడంలో విడుదలైనా తెలుగులో అక్టోబర్ 15న విడుదలైంది.

తెలుగులో బిజినెస్ వివరాలు

తెలుగులో బిజినెస్ వివరాలు


కన్నడంలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలై బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకున్న 'కాంతార'ను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుని.. ఏపీ, తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసింది.

13వ రోజు తెలుగు వసూళ్లిలా

13వ రోజు తెలుగు వసూళ్లిలా

'కాంతార' మూవీకి 13వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వసూళ్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 23 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రూ. 49 లక్షలు షేర్, రూ. 95 లక్షలు గ్రాస్ వసూలైంది.

13 రోజుల్లో ఎంత వచ్చింది?

13 రోజుల్లో ఎంత వచ్చింది?


13 రోజుల్లో 'కాంతార'కు కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 7.55 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.11 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.20 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.34 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 87 లక్షలు, గుంటూరులో రూ. 1.12 కోట్లు, కృష్ణాలో రూ. 1.12 కోట్లు, నెల్లూరులో రూ. 69 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 17.00 కోట్లు షేర్, రూ. 30.95 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

వినూత్నమైన కథతో వచ్చిన 'కాంతార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 17.00 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 14.70 కోట్లు లాభాలు లభించాయి.

మరో రికార్డు.. 30 లక్షలు వస్తే

మరో రికార్డు.. 30 లక్షలు వస్తే


కన్నడంలో సెన్సేషనల్ హిట్ అయిన 'కాంతార' మూవీకి తెలుగులో ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం తాజాగా తెలుగులో రూ. 30 కోట్ల గ్రాస్ మార్కును చేరుకుంది. అలాగే, మరో రూ. 30 లక్షలు షేర్ వస్తే.. దీనికి రూ. 15 కోట్ల లాభాలు వస్తాయి. అదే జరిగితే మరో రికార్డు నమోదు అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X