Kantara Telugu Collections: శనివారం రికార్డు కలెక్షన్లు.. 15వ నాలుగు రెట్లు.. టోటల్ ఎంతో తెలిస్తే!
కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ మధ్య కాలంలో ఎన్నో అత్యుత్తమ చిత్రాలు వస్తున్నాయి. వాటికి ప్రేక్షకులు కూడా భారీ స్పందనను అందిస్తున్నారు. ఫలితంగా అలాంటివి సూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. అదే సమయంలో ఆయా చిత్రాలను వేరే భాషల్లోకి కూడా డబ్బింగ్ చేస్తున్నారు. అలా ఇటీవలే విడుదలైన క్రేజీ మూవీనే 'కాంతార'. కన్నడంలో గత నెలలోనే విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ మూవీ.. తెలుగులో కూడా భారీ స్పందనతో సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'కాంతార' మూవీ 15 రోజుల రిపోర్టుపై మీరే లుక్కేయండి!

తెలుగులో కాంతారకు సక్సెస్
కన్నడ ఆల్‌రౌండర్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'కాంతార'. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం అందించారు. ఇది కన్నడంలో విడుదలైనా తెలుగులో అక్టోబర్ 15న రిలీజ్ అయింది.

తెలుగులో బిజినెస్ వివరాలు
కన్నడంలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'కాంతార'ను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుని.. ఏపీ, తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చింది.

15వ రోజు తెలుగు వసూళ్లిలా
'కాంతార' మూవీకి 15వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వసూళ్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.02 కోట్లు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. రూ. 1.63 కోట్లు షేర్, రూ. 2.85 కోట్లు గ్రాస్ వసూలైంది.

15 రోజుల్లో ఎంత వచ్చింది?
15 రోజుల్లో 'కాంతార'కు కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 8.79 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.29 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.38 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.46 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 95 లక్షలు, గుంటూరులో రూ. 1.23 కోట్లు, కృష్ణాలో రూ. 1.22 కోట్లు, నెల్లూరులో రూ. 74 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 19.06 కోట్లు షేర్, రూ. 34.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?
విభిన్నమైన కథతో రూపొందిన 'కాంతార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 15 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 19.06 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 16.76 కోట్లు లాభాలు వచ్చాయి.

ఒక్క రోజే నాలుగు రెట్లు పెరిగి
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'కాంతార' మూవీకి తెలుగులో కూడా ఆశించిన దానికంటే ఎక్కువగా స్పందనే వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే 14వ రోజు ఈ మూవీకి రూ. 43 లక్షలు మాత్రమే వచ్చాయి. అయితే, 15వ రోజైన శనివారం దీనికి ఏకంగా రూ. 1.63 కోట్లు వచ్చాయి. అంటే శుక్రవారం కంటే నాలుగు రెట్లు వసూళ్లు పెరిగాయి.


Click it and Unblock the Notifications











